Sitara Dance Viral Video: కళావతి పాటకు మహేష్ కూతురు సితార డాన్స్... అచ్చం తండ్రిలాగే...

Published : Feb 20, 2022, 02:29 PM IST
Sitara Dance Viral Video: కళావతి పాటకు మహేష్ కూతురు సితార డాన్స్...  అచ్చం తండ్రిలాగే...

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) కూతురు సితార సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. యూట్యూబ్ వీడియోస్ తో ఓన్ ఇమేజ్ తెచ్చకుంది స్టార్ కిడ్. ఇప్పుడు సరికొత్త డాన్స్ వీడియోతో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) కూతురు సితార సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. యూట్యూబ్ వీడియోస్ తో ఓన్ ఇమేజ్ తెచ్చకుంది స్టార్ కిడ్. ఇప్పుడు సరికొత్త డాన్స్ వీడియోతో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది.

సోషల్ మీడియా క్వీన్ గా మారిపోయింది.. సూపర్ స్టార్ డాటర్ సితార(Sitara). చిన్న తనం నుంచే ఇన్ స్టా వీడియోస్ తో.. డాన్స్  వీడియోస్ తో హడావిడి చేస్తూ వచ్చిన సితార.. ఇప్పుడు సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ చేసింది. సొంతంగా ఇన్ స్టా అకౌంట్ కూడా ఓపెన్ చేసి.. తన అభిప్రాయాలు ఎప్పటికప్పుడు పంచుకుంటుందవి.

మహేష్ బాబు (Mahesh Babu) పాటలకు డాన్స్ చేయడం సితారకు కొత్తేం కాదు. ఎప్పటికప్పుడు కొత్త పాటను ఇమిటేట్ చేస్తూ.. సూపర్ స్టార్ లా డాన్స్ చేయడం అంటే ఆమెకు చాలా ఇష్టం. ఇక రీసెంట్ గా ఇలాంటి వీడియోనే చేసింది సితార. రీసెంట్ గా సర్కారువారి పాట సినిమా నుంచి రిలీజ్ అయిన కళావతి పాటకు అదిరిపోయే స్టెప్పులేసింది సితార. అచ్చంగా తండ్రి మహేష్ బాబు (Mahesh Babu) వేసినట్టే అదే స్టెప్పులను ఇమిటేట్ చేసింది.

 

సితార డాన్స్ వీడియోకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. బాడీ లాగ్వేజ్ తో పాటు.. డాన్స్ స్టైల్ చూస్తుంటే ఇండస్ట్రీలో మంచి ఫ్యూచర్ ఉంది అంటూ కొంతమంది అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియోను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది మహేష్ బాబు (Mahesh Babu) సతీమణి నమ్రత. ప్రస్తుతం  ఈ వీడియో వైరల్ అవుతోంది.

ఇలాంటి వీడియోలు ఈ స్టార్ కిడ్స్ కు కొత్తేం కాదు. వేకేషన్స్ కు వెళ్లినా.. ఇంట్లో ఉన్నా.. ఏదో ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తుంటారు. ఈ వీడియోస్ ను ఎక్కువగా నమ్రత ఇన్ స్టాలో శేర్ చేస్తుంటారు.  ప్రస్తుతం సర్కారువారి పాట చేస్తున్నాడు మహేష్ బాబు(Mahesh Babu). త్వరలో ఈమూవీ షూటింగ్ కంప్లీట్ చేసి.. నెక్ట్స్ త్రివిక్రమ్ సినిమాలో జాయిన్ కాబోతున్నాడు.

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: దీప, కార్తీక్ లపై రెచ్చిపోయిన పారు, జ్యో- శ్రీధర్ పదవి పోయినట్లేనా?
Gurram Paapi Reddy Review: గుర్రం పాపిరెడ్డి మూవీ రివ్యూ, రేటింగ్‌.. బ్రహ్మానందం, యోగిబాబు సినిమా ఎలా ఉందంటే?