Bheemla Nayak:యూఎస్ లో భీమ్లా నాయక్ జోరు... అడ్వాన్స్ బుకింగ్స్ కలెక్టన్స్ ఏతంటే!

Published : Feb 20, 2022, 02:18 PM IST
Bheemla Nayak:యూఎస్ లో భీమ్లా నాయక్ జోరు... అడ్వాన్స్ బుకింగ్స్ కలెక్టన్స్ ఏతంటే!

సారాంశం

భీమ్లా నాయక్ (Bheemla Nayak)మాస్ జాతరకు మరో ఐదు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ మూవీపై ఏ రేంజ్ హైప్ నెలకొని ఉందో అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే అర్థం అవుతుంది. ముఖ్యంగా యూఎస్ లో భీమ్లా నాయక్ టికెట్స్ హాట్  కేకుల్లా అమ్ముడు పోతున్నాయి.   

భీమ్లా నాయక్ మూవీ భారీ ఓపెనింగ్ రికార్డు సెట్ చేసేలా కనిపిస్తుంది. పవన్ (Pawan Kalyan)మూవీ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ లో కూడా భీమ్లా నాయక్ అడ్వాన్స్ బుకింగ్స్ లో జోరు చూపిస్తుంది. ఒకరోజు ముందే యూఎస్ లో భీమ్లా నాయక్ ప్రీమియర్స్ ప్రదర్శన జరగనుంది. ఈ నేపథ్యంలో భీమ్లా నాయక్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే భారీ వసూళ్లు రాబట్టేలా కనిపిస్తుంది. ఇక ఇప్పటికే భీమ్లా నాయక్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా $200000 డాలర్స్ దాటేసింది. 


మరో నాలుగు రోజుల సమయం ఉండగానే భీమ్లా నాయక్ ఈ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా కలెక్షన్స్ రాబట్టడం పవన్ మేనియా ఏ రేంజ్ లో ఉందో నిరూపిస్తుంది. భీమ్లా నాయక్ ఇదే స్థాయిలో జోరు చూపిస్తే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే వన్ మిలియన్ మార్కు దాటివేయడం ఖాయంగా కనిపిస్తుంది. మరోవైపు బీమ్లా నాయక్ ట్రైలర్ రేపు గ్రాండ్ గా విడుదల కానుంది. రెండు నిమిషాలకు పైగా నిడివి కలిగిన ట్రైలర్ అవుట్ అండ్ అవుట్ మాస్ అంశాలతో రూపొందించినట్లు సమాచారం. భీమ్లా నాయక్ ట్రైలర్  కోసం పవన్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 


ఇక రేపు జరగనున్న భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుకకు టీఆర్ఎస్ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ అతిథులుగా హాజరవుతున్నారు. పవన్ సినిమా వేడుకకు రాజకీయ నాయకులు గెస్ట్స్ గా రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. భీమ్లా నాయక్ మూవీ మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోశియుమ్ కి అధికారిక రీమేక్. దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కించగా... నాగవంశీ నిర్మించారు. దర్శకుడు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే సమకూర్చారు. థమన్ సంగీతం అందిస్తుండగా రానా కీలక రోల్ చేస్తున్నారు. నిత్యామీనన్ రానాకి జంటగా నటిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: దీప, కార్తీక్ లపై రెచ్చిపోయిన పారు, జ్యో- శ్రీధర్ పదవి పోయినట్లేనా?
Gurram Paapi Reddy Review: గుర్రం పాపిరెడ్డి మూవీ రివ్యూ, రేటింగ్‌.. బ్రహ్మానందం, యోగిబాబు సినిమా ఎలా ఉందంటే?