బలయ్యేది హీరోయిన్లే.. హీరోలు, నిర్మాతలపై బాలీవుడ్ బ్యూటీ హాట్ కామెంట్స్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 20, 2022, 02:12 PM ISTUpdated : Feb 20, 2022, 02:14 PM IST
బలయ్యేది హీరోయిన్లే.. హీరోలు, నిర్మాతలపై బాలీవుడ్ బ్యూటీ హాట్ కామెంట్స్

సారాంశం

బాలీవుడ్ అందాల భామ భూమి పెడ్నేకర్ సెన్సేషనల్ కామెంట్స్ తో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. 2015లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన భూమి పెడ్నేకర్ ప్రస్తుతం బోల్డ్ బ్యూటీగా రాణిస్తోంది.

బాలీవుడ్ అందాల భామ భూమి పెడ్నేకర్ సెన్సేషనల్ కామెంట్స్ తో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. 2015లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన భూమి పెడ్నేకర్ ప్రస్తుతం బోల్డ్ బ్యూటీగా రాణిస్తోంది. టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ, శుభ మంగళ్ సావధాన్, బదాయి హో లాంటి చిత్రాలు భూమి పెడ్నేకర్ కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. 

మనసులో ఉన్నది నిర్మొహమాటంగా చెప్పే హీరోయిన్ భూమి పెడ్నేకర్. మరోసారి బోల్డ్ కామెంట్స్ తో ఈ బ్యూటీ వార్తల్లో నిలిచింది. కోవిడ్ టైంలో హీరోయిన్ల రెమ్యునరేషన్ గురించి భూమి ఘాటు వ్యాఖ్యలు చేసింది. కోవిడ్ టైంలో నిర్మాతలు హీరోయిన్లకు రెమ్యునరేషన్ తగ్గించి ఇచ్చారని ఆరోపించింది. కొరోనా వల్ల నష్టాలు ఎదురవుతున్నాయని.. రెమ్యునరేషన్ తగ్గించారు. 

కానీ హీరోల రెమ్యునరేషన్ మాత్రం తగ్గించలేదు. హీరోలని రెమ్యునరేషన్ తగ్గించుకోమని చెప్పే ధైర్యం నిర్మాతలకు లేదు. ఇదెక్కడి న్యాయం అని భూమి ప్రశ్నిస్తోంది. హీరోయిన్లని మాత్రం బలిచేస్తారు అంటూ ఆరోపించింది. ఇది చాలా విచిత్రమైన పరిస్థితిగా భూమి అభివర్ణించింది. 

దీనితో భూమి పెడ్నేకర్ కామెంట్స్ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే  మహిళలపై వేధింపులు జరుగుతున్నాయనే ప్రచారంతో బాలీవుడ్ పరువు పోగొట్టుకుంది. తాజాగా రెమ్యునరేషన్ విషయంలో కూడా నిర్మాతలు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని భూమి పెడ్నేకర్ ఆరోపించింది. భూమి పెడ్నేకర్ ఆరోపణలపై నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

Actor Sreenivasan: ప్రముఖ నటుడు, దర్శకుడు శ్రీనివాసన్ కన్నుమూత.. 48 ఏళ్ల సినీ ప్రస్థానానికి ముగింపు
Bigg Boss Telugu 9: చివరి రోజు ఓటింగ్‌ తలక్రిందులు, పక్కా ప్లాన్‌ ప్రకారమే.. టాప్‌లో ఉన్నదెవరంటే?