మన సినిమా కోసం ఎదురుచూస్తున్నా: మహేష్ బాబు

Published : Jan 11, 2019, 02:37 PM IST
మన సినిమా కోసం ఎదురుచూస్తున్నా: మహేష్ బాబు

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో 'వన్ నేనొక్కడినే' అనే సినిమా రూపొందింది. ఈ సినిమా ఆశించిన సక్సెస్ అందుకోనప్పటికీ మరోసారి వీరిద్దరూ కలిసి పని చేయబోతున్నారనే వార్తలు వినిపించాయి.

'రంగస్థలం' తరువాత సుకుమార్ డైరెక్ట్ చేయబోయేది మహేష్ బాబునే అని సమాచారం. తాజాగా దీనికి సంబంధించి మహేష్ బాబు ట్వీట్ చేశాడు. ఈరోజు సుకుమార్ పుట్టినరోజు కావడంతో ట్విట్టర్ ద్వారా అతడికి శుభాకాంక్షలు చెప్పాడు మహేష్.

''మోస్ట్ హంబుల్, సూపర్ టాలెంటెడ్ సుకుమార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. మన సినిమా కోసం ఎదురుచూస్తున్నాను సర్'' అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: చిచ్చు పెట్టిన జ్యో- శివన్నారాయణ ఉగ్రరూపం- కార్తీక్ కి చెంప దెబ్బ
Prabhas: 2 ఎకరాల్లో 200 కోట్ల రాజభవనం.. ప్రభాస్ డ్రీమ్ హౌస్ ప్లేస్ వాల్యూ ఎంతో తెలుసా? షాక్ అవుతారు..