ఇంద్రకీలాద్రిపై సూపర్ స్టార్ మహేష్!

Siva Kodati |  
Published : May 18, 2019, 06:09 PM IST
ఇంద్రకీలాద్రిపై సూపర్ స్టార్ మహేష్!

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం మహర్షి విడుదలై బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. మహర్షి చిత్రం మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. వంశీ పైడిపల్లి రైతుల ప్రాముఖ్యతని తెలియజేసేలా తెరకెక్కించిన ఈ చిత్రానికి సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం మహర్షి విడుదలై బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. మహర్షి చిత్రం మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. వంశీ పైడిపల్లి రైతుల ప్రాముఖ్యతని తెలియజేసేలా తెరకెక్కించిన ఈ చిత్రానికి సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. ఇదిలా ఉండగా మహర్షి విడుదలై వారం గడచినా చిత్ర యూనిట్ జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మహేష్ బాబు స్వయంగా వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ మహర్షికి ప్రచారం కల్పిస్తున్నాడు. 

ఇదిలా ఉండగా నేడు(శనివారం) మహేష్ బాబుతో పాటు మహర్షి చిత్రయూనిట్ విజయవాడకు చేరుకున్నారు. కొద్ది సేపటిక్రితమే మహేష్, దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత పీవీపీ ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. మహర్షి చిత్ర బృందానికి ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు. తీర్థ ప్రసాదాలు అందించారు. 

దీనితో మహేష్ బాబుని చూసేందుకు ఆలయంలో ప్రజలు ఎగబడ్డారు. నేడు మహర్షి చిత్ర విజయోత్సవ వేడుక విజయవాడలోని సిద్దార్థ్ కళాశాలలో జరగనుంది. ఈ చిత్రంలో మహేష్ బాబు స్టూడెంట్ గా, కార్పొరేట్ సంస్థ సీఈఓగా, రైతుల సమస్యలని పరిష్కరించే వ్యక్తిగా మూడు విభిన్న కోణాల్లో నటించి మెప్పించాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. 

PREV
click me!

Recommended Stories

400 కోట్లకు పైగా బాక్సాఫీస్ వసూళ్లు సాధించిన టాప్ 5 సినిమాలు ఇవే
Rashmi Gautam Marriage: యాంకర్‌ రష్మి పెళ్లి వార్త.. చేసుకునేది అతన్నే