మెగా హీరోకు జోడిగా మంగుళూరు పిల్ల.. హీరోయిన్ ఖరారు!

Siva Kodati |  
Published : May 18, 2019, 05:45 PM IST
మెగా హీరోకు జోడిగా మంగుళూరు పిల్ల.. హీరోయిన్ ఖరారు!

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా, సాయిధరమ్ తేజ్ తమ్ముడిగా పంజా వైష్ణవ్ తేజ్ తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నాడు. వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ కొన్ని నెలల క్రితం లాంచ్ అయింది. 

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా, సాయిధరమ్ తేజ్ తమ్ముడిగా పంజా వైష్ణవ్ తేజ్ తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నాడు. వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ కొన్ని నెలల క్రితం లాంచ్ అయింది. మెగాస్టార్ చిరంజీవి ఆ కార్యక్రమానికి హాజరైన సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ సుకుమార్ అందిస్తున్న కథతో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి ఉప్పెన అనే టైటిల్ ఖరారు చేసినట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు. మరికొన్ని ఆసక్తికర విషయాలని కూడా చిత్ర యూనిట్ తెలియజేసింది. 

సుకుమార్, మైత్రి మూవీస్ సంయుక్త నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ చిత్రంతో దర్శకుడిగా మారుతున్నాడు. వైష్ణవ్ తేజ్ సరసన నటించబోయే హీరోయిన్ ని తాజాగా మైత్రి మూవీస్ సంస్థ ఖరారు చేసింది. మంగళూరుకు చెందిన కృతి శెట్టి అనే యంగ్ బ్యూటీ ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం కాబోతోంది. 

ఉప్పెన రెగ్యులర్ షూటింగ్ మే 25 నుంచి ప్రారంభం కాబోతున్నట్లు ప్రకటించారు. ఉప్పెన చిత్రంపై క్రమంగా ఆసక్తి పెరుగుతోంది. ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ మత్స్యకారుడిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళ క్రేజీ హీరో విజయ్ సేతుపతి ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. 

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీ అప్డేట్.. ఇలా అయితే సురేందర్ రెడ్డికి కష్టమేగా ?
Rashmika Mandanna: విజయ్‌ దేవరకొండతో పెళ్లి.. ఫస్ట్ టైమ్ ఓపెన్‌ అయిన రష్మిక మందన్నా