
మహేష్ బాబు ఈ మథ్యకాలంలో ట్విట్టర్ లో అప్ టు డేట్ గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు పలు అంశాలపై స్పందిస్తున్నారు. ముఖ్యంగా తన మనస్సుకు నచ్చిన సినిమాని అభినందించంటలో వెనకాడటం లేదు. తాజాగా ఆయన ‘ఎఫ్ 2’ టీజర్ చూసి వెంటనే ట్వీట్ చేసారు. చాలా ఫన్ గా ఎంటర్టైన్మెంట్ తో ఉందని, వెంకటేష్ టెర్రిఫిక్ అని ఆయన కితాబు ఇచ్చారు. ఆ ట్వీట్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.
కామెడీ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందుతోన్న మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్ 2’. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అనేది ట్యాగ్ లైన్. ఇందులో తమన్నా, మెహరీన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు ఈ సినిమా నిర్మిస్తున్నారు. సంక్రాంతికి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. రీసెంట్ గా ‘f2’ టీజర్‌ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.
టీజర్ లో ..‘ఇప్పుడు ఈ పెళ్లి అవసరమా వెంకీ?’ అని రఘుబాబు అంటే.. ‘నేను మీలాగా కాదు.. పెళ్లాంని ఎలా కంట్రోల్ చేయాలో నాకు బాగా తెలుసు..’ అన్న వెంకీ.. ఆ తర్వాత భార్య తమన్నాతో వేగలేక ముప్పతిప్పలు పడుతూ కనిపించి నవ్వించారు.
‘ఒక చరిత్ర గురించి చెప్పాలంటే క్రీస్తుపూర్వం, క్రీస్తుశకం అంటాం.. ఒక మగాడి గురించి చెప్పాలంటే పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత..’ అంటున్నారు వెంకటేశ్. ‘ఓ చరిత్ర చెప్పాలంటే తెలంగాణ రాకముందు.. తెలంగాణ వచ్చిన తర్వాత’ అని వరుణ్ వేసే పంచ్ తో ఫక్కున నవ్వు వస్తుంది.