రివర్స్ గేర్ :అల్లు అర్జున్ కి త్రివిక్రమ్ డెడ్ లైన్

By Udayavani DhuliFirst Published Dec 13, 2018, 11:44 AM IST
Highlights

సాధారణంగా స్టార్ హీరోలు ...తమతో చేయాలనుకున్న దర్శకులకు కండీషన్స్ పెడుతూ..డెడ్ లైన్స్ పెడుతూంటారు. తాము చెప్పిన నిర్మాతతో సినిమా చెయ్యాలని, తాము అనుకున్న హీరోయిన్ ని తీసుకోవాలని ఇలా రకరకాల ట్విస్ట్ లు ఇస్తూంటారు. 

సాధారణంగా స్టార్ హీరోలు.. తమతో చేయాలనుకున్న దర్శకులకు కండీషన్స్ పెడుతూ.. డెడ్ లైన్స్ పెడుతూంటారు. తాము చెప్పిన నిర్మాతతో సినిమా చెయ్యాలని, తాము అనుకున్న హీరోయిన్ ని తీసుకోవాలని ఇలా రకరకాల ట్విస్ట్ లు ఇస్తూంటారు. అయితే ఇప్పుడు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ రివర్స్ లో అల్లు అర్జున్ కు ఓ డెడ్ లైన్ పెట్టారనే వార్త మీడియాలో హల్ చల్ చేస్తోంది. 

ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం త్రివిక్రమ్ , అల్లు అర్జున్ కాంబినేషన్ లో అనుకున్న ప్రాజెక్టు ఓ షేప్ కు వచ్చింది. మొదట ఓ బాలీవుడ్ చిత్రం రీమేక్ అనుకున్నా  చివరకి త్రివిక్రమ్ చెప్పిన ఓ ఫ్రెష్ స్క్రిప్టుకు బన్ని ఓటేసాడు. అక్కడిదాకా బాగానే ఉంది. అయితే నిర్మాత విషయంలోనే ట్విస్ట్ పడింది. అల్లు అర్జున్ కు తన తదుపరి చిత్రం గీతా ఆర్ట్స్ లో చేయాలని ఉంది. అదే సమయంలో త్రివిక్రమ్ తన సొంత బ్యానర్ లాంటి హారిక అండ్ హాసిని బ్యానర్ పై సినిమా చెయ్యాలనే పట్టుదల. ఈ విషయమై ఇద్దరూ ఓ అవగాహనకు రాలేకపోతున్నారట. 

చివరకు త్రివిక్రమ్ ఓ వారం రోజుల్లో అల్లు అర్జున్ ని డెసిషన్ తీసుకోమని ఫైనల్ చేసి చెప్పాడట. త్రివిక్రమ్ చెప్పిన బ్యానర్ లో సినిమా చేస్తానంటే వెంటనే ఎగ్రిమెంట్ అయ్యి..న్యూ ఇయిర్ రోజు ఎనౌన్సమెంట్ వస్తుంది. 

అలాకాకుండా బన్ని కనుక తాను గీతా ఆర్ట్స్ లోనే సినిమా చేస్తానని అంటే త్రివిక్రమ్ వేరే హీరోతో ముందుకు వెళ్తారట.ఆ హీరో కూడా మరెవకో కాదట నితిన్ అని తెలుస్తోంది. బన్ని కాదంటే నితిన్ తో సినిమా చేద్దామని ఫిక్స్ అయ్యాడట త్రివిక్రమ్. మరి బన్ని ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. 

click me!