మహేష్ బాబుపై కోర్టు ఆగ్రహం..!

Published : Jun 18, 2018, 06:04 PM IST
మహేష్ బాబుపై కోర్టు ఆగ్రహం..!

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ సినిమా షూటింగ్ ఈరోజు డెహ్రాడూన్ లో మొదలైంది

సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ సినిమా షూటింగ్ ఈరోజు డెహ్రాడూన్ లో మొదలైంది. ఈ విషయంపై కోర్టు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. అసలు విషయలోకి వస్తే.. బ్రహ్మోత్సవం సినిమా సమయంలో మహేష్ బాబు.. పివిపితో మరో సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా ఉండాలి. కానీ ఇప్పుడు ఆ సినిమాకు నిర్మాతలుగా దిల్ రాజు, అశ్వనీదత్ లు వ్యవహరిస్తున్నారు.

 దీంతో పివిపి వారందరిపై కేసు పెట్టాడు. ఇది తేలేవరకు సినిమా షూటింగ్ మొదలుపెట్టకూడదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ చిత్రబృందం వాటిని ఉల్లంఘించి డెహ్రాడూన్ లో షూటింగ్ మొదలుపెట్టింది. దీంతో కోర్టు సీరియస్ అయింది. కోర్టు ఆదేశాలను లెక్క చేయనందున.. 'కేసు కోర్టులో ఉంటే షూటింగ్ ఎలా మొదలుపెడతారు' అంటూ మళ్లీ చిత్రబృందానికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

దీంతో మహేష్ సినిమా మరోసారి చిక్కుల్లో పడింది. మహేష్ బాబు కూడా కోర్టు కేసు తేలిన తరువాత సినిమా షూటింగ్ మొదలుపెడదామని చెప్పినా.. నిర్మాత కన్విన్స్ చేయడంతో ఒప్పుకున్నాడట. కానీ ఇప్పుడు షూటింగ్ దాదాపు ఆగిపోయే పరిస్థితి వచ్చింది. మరి నిర్మాతలు ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి!  

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే