నిర్మాతలకు భరోసా-స్పైడర్ పై మహేష్

Published : Oct 15, 2017, 12:58 AM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
నిర్మాతలకు భరోసా-స్పైడర్ పై మహేష్

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరేగా నటించిన చిత్రం స్పైడర్ మురుగదాస్ తెరకెక్కించిన బై లింగువల్ మూవీ స్పైడర్ తాజాగా స్పైడర్ నష్టాన్ని తాను పూడుస్తానని హామీ ఇస్తున్న మహేష్

మహేష్ బాబు నటించిన 'స్పైడర్' సినిమా ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. చాలా కాలం పాటు ఈ సినిమా కోసం కష్టపడిన మహేష్ బాబుకి సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. అభిమానుల నుండి సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. ఈ రెస్పాన్స్ మహేష్‌ను డిస్టర్బ్ చేసింది. ఆ దశలో తను నటిస్తోన్న 'భరత్ అనే నేను' సినిమా షూటింగ్ కూడా కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చాడు. రీసెంట్ గానే షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు.

 

అయితే 'స్పైడర్' సినిమాతో నష్టపడ్డ నిర్మాతలకు మహేష్ ఓ మాట ఇచ్చాడని సమాచారం. 'స్పైడర్' కోసం 20 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకున్న మహేష్ సినిమాకు వచ్చిన నష్టాన్ని కొంతవరకు భర్తీ చేస్తానని చెప్పాడట. ‘భరత్ అనే నేను’ సినిమా రిలీజ్ సమయానికి కొంత డబ్బుని తిరిగి ఇస్తానని మహేష్ చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పుడు టాలీవుడ్‌లో ఇదొక హాట్ టాపిక్‌గా మారింది. గతంలో కూడా మహేష్ తన కారణంగా నష్టపోయిన నిర్మాతలను ఆడుకున్నాడు. ఇలా నిర్మాతలకు సపోర్ట్ చేసే హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారనే చెప్పాలి.

 

సినిమా చేసామా..? మన రెమ్యూనరేషన్ మనకు ముట్టిందా..? అంతవరకే ఉంటున్నారు హీరోలు. ఈ నేపధ్యంలో మహేష్ మాత్రం తన నిర్మాతలకు అండగా ఉండడం అభినందించాల్సిన విషయం.

PREV
click me!

Recommended Stories

Ramayana Stars: రామాయణ స్టార్స్ యశ్, రణ్‌బీర్... ఇద్దరిలో ఎవరి ఆస్తి ఎక్కువ?
Spider Man: Brand New Day Review: స్పైడర్‌ మ్యాన్‌: బ్రాండ్‌ న్యూ డే రివ్యూ.. పీటర్‌ సాహసాలు ఈ సారి వేరే లెవల్‌