మహేష్ బాబు, కేటీఆర్ ఓ స్వీట్ కాన్వర్జేషన్!

Published : Jun 02, 2018, 03:15 PM ISTUpdated : Jun 02, 2018, 03:18 PM IST
మహేష్ బాబు, కేటీఆర్ ఓ స్వీట్ కాన్వర్జేషన్!

సారాంశం

తెలంగాణా ఐటీ మినిస్టర్ కేటీఆర్ ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉంటారు. స్టార్ హీరో మహేష్ బాబు 

తెలంగాణా ఐటీ మినిస్టర్ కేటీఆర్ ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉంటారు. స్టార్ హీరో మహేష్ బాబు మాత్రం సోషల్ మీడియాకు చాలా దూరం. అటువంటి వీరిద్దరి మధ్య జరిగిన  కాన్వర్జేషన్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

మహేష్ బాబు రాజకీయనాయకులతో పెద్దగా కలిసి ఉన్న దాఖలాలు లేవు కానీ కేటీఆర్ తో మాత్రం చాలా సన్నిహితంగా ఉంటారు. రీసెంట్ గా మహేష్ నటించిన 'భరత్ అనే నేను' సినిమా బాగుందని మహేష్ తో కలిసి ఓ ఇంటర్వ్యూలో కూడా పాల్గొన్నారు కేటీఆర్.ఇది ఇలా ఉంటే ఇటీవల ఓ పబ్లిక్ ఈవెంట్ కు హాజరైన కేటీఆర్ అక్కడున్న యూత్ తో కలిసి ఓ ఫోటో తీసుకున్నారు. 

ఆ సెల్ఫీను సోషల్ మీడియాలో పంచుకున్న ఓ యువకుడు ''ఇది నిజం.. కేటీఆర్ గారు అబ్బాయిలకు కూడా సెల్ఫీలు ఇస్తారు'' అంటూ ట్వీట్ చేశారు. దీనిపై కామెంట్ చేసిన కేటీఆర్.. మహేష్ ను ట్యాగ్ చేస్తూ 'మహేష్ ఇది నీకోసమే' అంటూ కామెంట్ పెట్టారు. దీనికి రిప్లై చేస్తూ మహేష్ నవ్వుతున్న ఓ ఎమోజీను పెట్టాడు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ ట్వీట్ల సంభాషణ అభిమానులను ఆకట్టుకుంటోంది.  

 

 

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?