'మహర్షి' 'టీజర్ రికార్డ్స్ : ఫుల్‌స్టాఫ్‌ లేదు.. కామాలు మాత్రమే

Published : Apr 07, 2019, 07:02 PM IST
'మహర్షి' 'టీజర్ రికార్డ్స్ : ఫుల్‌స్టాఫ్‌  లేదు.. కామాలు మాత్రమే

సారాంశం

మహేశ్ బాబు నటిస్తున్న కొత్త చిత్రం మహర్షి టీజర్ యూట్యూబ్ లో ప్రభంజనం సృష్టిస్తూ దూసుకుపోతోంది. 

మహేశ్ బాబు నటిస్తున్న కొత్త చిత్రం మహర్షి టీజర్ యూట్యూబ్ లో ప్రభంజనం సృష్టిస్తూ దూసుకుపోతోంది. ఫ్యాన్స్ కు ఉగాది కానుకగా వచ్చిన ఈ టీజర్ కు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. టీజర్ లో మహేష్ చెప్పినట్టు ‘సక్సెస్‌లో ఫుల్‌స్టాఫ్‌లు ఉండవు.. కామాలు మాత్రమే ఉంటాయి’ అనే విధంగా దూసుకెళ్తోంది. 

మహర్షి టీజర్ కు యూట్యూబ్ లో ఒక 1.2 కోట్ల వ్యూస్ రావడం స్టామినాని తెలియచేస్తోంది. అంతేకాదు, కోటి వ్యూస్ నుంచి 1.2 కోట్ల వ్యూస్ కి చేరడానికి చాలా తక్కువ సమయం తీసుకున్న టీజర్ గా మహర్షి రికార్డు నెలకొల్పింది. 

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక్కరోజు వ్యవధిలో ఎక్కువమంది చూసిన టీజర్ కూడా ఇదే కావటం విశేషం. దాంతోపాటే, ట్విట్టర్ లో ఎక్కువమంది రీట్వీట్ చేసిన, లైక్ చేసిన టీజర్ గానూ మహర్షి మరో ఘనత అందుకుంది.

ఇక  ఈ టీజర్‌లో మహేష్‌బాబు మునుపటి కంటే ఇంకా స్టైలిష్ అండ్ క్లాస్ లుక్‌తో అదరగొట్టారు. యాక్షన్ సీక్వెన్స్‌లలో మాస్ ఆడియన్స్‌ను అలరించే విధంగా ఫైట్స్ తో దుమ్ము రేపారు.   రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Top 10 Movies 2025: పవన్, వెంకటేష్, రాంచరణ్ లలో బాక్సాఫీస్ వద్ద ఎవరి సత్తా ఎంత ? 2025లో టాప్ 10 మూవీస్ ఇవే
Akhanda 2: అఖండ 2 రిలీజ్ కి తొలగిన అడ్డంకులు, మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కానీ ఆ ఒక్క సమస్య ఇంకా ఉంది