'మహర్షి' షాకింగ్ ప్రీరిలీజ్ బిజినెస్!

Published : Apr 12, 2019, 11:46 AM IST
'మహర్షి' షాకింగ్ ప్రీరిలీజ్ బిజినెస్!

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం 'మహర్షి' . వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం 'మహర్షి' . వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ వంద కోట్లకు అమ్ముడవ్వగా.. నాన్ థియేట్రికల్ హక్కులు 45 కోట్లకు అమ్ముడయ్యాయని సమాచారం.

మొత్తంగా చూసుకుంటే ప్రీరిలీజ్ బిజినెస్ 145 కోట్లకు పైగా చేసినట్లు తెలుస్తోంది. బాహుబలి సినిమా తరువాత ఆ రేంజ్ లో ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా ఈ సినిమా రికార్డులు సృష్టిస్తోంది. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అల్లరి నరేష్ కీలకపాత్రలో నటిస్తున్నాడు.  

PREV
click me!

Recommended Stories

OTT Movies: 1000 కోట్ల పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ఓటీటీలోకి, శ్రీకాంత్ కొడుకు రోషన్ మూవీ కూడా.. ఈ వారం పండగే
మా అందరికంటే ఎక్కువ ఆస్తి ఉన్నది ఆయనకే.. చైతన్య కృష్ణ కీలక వ్యాఖ్యలు..