రూ.175 కోట్ల 'మహర్షి'..!

Published : May 29, 2019, 09:56 AM IST
రూ.175 కోట్ల 'మహర్షి'..!

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. 

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. వసూళ్ల పరంగా ఈ సినిమా తన సత్తా చాటుతోంది. కేవలం 18 రోజుల్లో రూ.175 కోట్ల గ్రాస్ ని రాబట్టినట్లు చిత్రబృందం వెల్లడించింది.

ఈ క్రమంలో ఓ పోస్టర్ ని విడుదల చేసింది. మహేష్ నటించిన 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' సినిమాల తరువాత రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన సినిమా ఇదే కావడం విశేషం.

రైతులు, వ్యవసాయం నేపధ్యంలో దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా.. అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించారు. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు సమకూర్చారు. దిల్‌రాజు, ప్రసాద్‌ వి పొట్లూరి, అశ్విని దత్‌ సంయుక్తంగా నిర్మించారు.  

PREV
click me!

Recommended Stories

Trigun: సొంత టీంకే వెన్నుపోటు, త్రిగుణ్ దెబ్బకు మారిపోయిన ఆట..కెప్టెన్ గా అవతరించిన రామ్ ప్రసాద్
Ramayana:హైదరాబాద్ లో రామాయణ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డేట్ ఫిక్స్..రణబీర్, యశ్ తోపాటు టీమ్ మొత్తం రెడీ