కేడీ నాగశౌర్య...కిలాడీ అవసరాల

By Prashanth MFirst Published May 29, 2019, 9:23 AM IST
Highlights

కణం, అమ్మమ్మగారిల్లు, నర్తన శాల ఇలా వరసపెట్టి డిజాస్టర్స్ రావటం నాగశౌర్యని కంగారుపెట్టినట్లుంది. దర్శకులు తెచ్చి వినిపించే కథలపై నమమ్మకం పోతోంది.  మళ్లీ ఛలో లాంటి హిట్ కావాలంటే ఏదో ఒక మ్యాజిక్ జరగాలి. అందుకేనేమో ఆయన ఈ సారి రీమేక్ ని నమ్ముకోవాలని డిసైడ్ అయ్యారు. చాలా మంది యువ దర్శకులు వినిపించిన కథలు తనకు సూట్ అవ్వవు అనిపించటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 
 
తమిళంలో శివకార్తికేయన్ హీరోగా వచ్చి హిట్టైన "కేడి బిల్లా-కిలాడి రంగా"  చిత్రాన్ని రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.  "పసంగ, మేము, కథకళి" వంటి సూపర్ హిట్ చిత్రాల ఫేం పాండిరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. రెజీనా-బిందు మాధవి హీరోయిన్లుగా, విమల్‌-శివకార్తికేయన్‌ హీరోలుగా నటించిన ఈ చిత్రానికి యువన్‌ శంకర్‌రాజా సంగీతం అందించారు.   ఈ సినిమా తమిళంలో ఘన విజయం సాధించి శివకార్తికేయన్ కు క్రేజ్ తెచ్చిపెట్టింది. 

అయితే ఈ చిత్రాన్ని భీమవరం టాకీస్‌ బ్యానర్‌పై రాజ్ కందుకూరి సమర్పణలో ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ  డబ్బింగ్ చేసి వదిలారు. అయితే ఎవరు పట్టించుకోలేదనుకుండి. ఇక ఇదే టైటిల్ తో వచ్చిన ఈ చిత్రం యూట్యూబ్ లో లభ్యమవుతోంది. దాంతో అల్రెడీ జనాలకు అందుబాటులో ఉన్న చిత్రాన్ని మళ్లీ రీమేక్ చేస్తే కలిసి వస్తుందా అని అంటున్నారు. అలాగే ఈ చిత్రంలో మరో పాత్రకు గాను అవసరాల శ్రీనివాస్ ని అనుకుంటున్నట్లు సమాచారం. మరి దర్శకత్వం ఎవరు చేయబోతున్నారో తెలియాల్సి ఉంది.

click me!