
రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అంటే పసి పిల్లాడి నుంచి పండు ముసలి వరకు గంతులు వేయాల్సిందే. అంతగా సౌత్ ని ఊపేసిన DSP ఇప్పుడు మాత్రం అంతగా ఆకట్టుకోవడం లేదనే టాక్ మొదలైంది. రంగస్థలం సినిమాతో గత ఏడాది బెస్ట్ మ్యూజిక్ అందించిన దేవి ఆ తరువాత మళ్ళీ ఆ రేంజ్ లో మ్యూజిక్ ఇవ్వలేదు.
ఇక మహేష్ అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్న మహర్షి సాంగ్స్ కూడా అంతగా వర్కవుట్ కావడం లేదని క్లారిటీగా అర్ధమవుతోంది. మొదటి పాట పాత ట్యూన్ లను గుర్తుకు తెస్తున్నట్లు టాక్ తెచ్చుకుందు. ఇక సెకండ్ సాంగ్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. వంశీ పైడిపల్లి సరిగ్గా ఉపయోగించుకోలేదా లేక దేవి పస తగ్గిందా అనే రేంజ్ లో మీమ్స్ వస్తున్నాయి.
మహేష్ 25వ సినిమా అంటే అభిమానులు అంచనాలు తారా స్థాయిలో ఉంటాయి. ఆ సంగతి చిత్ర యూనిట్ అంతగా పట్టించుకున్నట్లు లేదని అనుమానాలు వస్తున్నాయి. పైగా సినిమాకి బజ్ కూడా మళ్ళీ తగ్గిపోయింది. మరి మహర్షి ఎలాంటి ఆలోచనలతో సినిమాపై క్రేజ్ పెంచుతాడో చూడాలి. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా మే 9న రిలీజ్ కానుంది.