'చైతన్యయాత్ర' చేస్తున్న బాబాయ్, అబ్బాయ్

By Udayavani DhuliFirst Published Jan 21, 2019, 1:46 PM IST
Highlights

ఎన్టీఆర్ రాజకీయ ప్రయాణంలో ...విజయం లో చైతన్యయాత్ర ముఖ్యమైనది. చైతన్యరథంపై ప్రతి పల్లె, పట్నం తిరుగుతూ ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారు. అదే సమయంలో.., ప్రజలకు ఏం కావాలో తెలుసుకుంటూ చైతన్య రథయాత్రలో ప్రజలతో ఎన్టీఆర్ మమేకమయ్యి..వాళ్ల మనిషి గా వాళ్ల మనస్సులో ముద్ర వేసుకున్నారు.  

ఎన్టీఆర్ రాజకీయ ప్రయాణంలో ...విజయం లో చైతన్యయాత్ర ముఖ్యమైనది. చైతన్యరథంపై ప్రతి పల్లె, పట్నం తిరుగుతూ ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారు. అదే సమయంలో.., ప్రజలకు ఏం కావాలో తెలుసుకుంటూ చైతన్య రథయాత్రలో ప్రజలతో ఎన్టీఆర్ మమేకమయ్యి..వాళ్ల మనిషి గా వాళ్ల మనస్సులో ముద్ర వేసుకున్నారు.  

ప్రజలను చైతన్య పరుస్తూ ఎన్టీఆర్ చైతన్యరథంపైనే ఆంధ్రప్రదేశ్ నలుమూలలకూ ప్రచార యాత్రను సాగించారు. ఆయనకు చైతన్యరథమే ప్రచార వేదికగా, నివాసంగా మారిపోయింది. పాత చెవ్రోలెట్ వ్యానును రిపేరు చేయించి, దానిని ఒక కదిలే వేదికగా తయారు చేయించాడు. అదే ఓట్ల రూపంలో బ్యాలెట్ భాక్స్ లో కనపడి రికార్డ్ లు క్రియేట్ చేసింది. 

ఇక..ఈ  చైతన్యయాత్రలో  రథసారథిగా హరికృష్ణ పాత్ర కూడా  మర్చిపోలేనిది. పాతవాహనం చైతన్యరథంగా రూపుదిద్దుకోవడంలో హరికృష్ణ శ్రమదాగి ఉంది. తండ్రి ఓ శ్రామికుడిలా ఖాకీ దుస్తులు ధరించి, నిరంతరం ప్రయాణించి తన ఉపన్యాసాలతో ప్రజలని ఉత్తేజపరుస్తూంటే, ఆ వాహనాన్ని కొడుకే నడిపి శభాష్ అనిపించుకున్నారు. వేలాది కిలోమీటర్లు చైతన్య రథాన్ని ఒంటిచేత్తో ఎక్కడా అలసట అనేది లేకుండా నడిపి తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి తన వంతు కృషిచేశారు. 

ఎన్టీఆర్ జీవించి ఉన్నంత కాలం తెరవెనుకకు మాత్రమే పరిమితమయ్యారు హరికృష్ణ. ఇప్పుడు ఇవన్నీ  ఎందుకు గుర్తు చేసుకుంటున్నామంటే.. ప్రస్తుతం ఎన్టీఆర్ మహానాయకుడులో నందమూరి బాలకృష్ణ, కల్యాణ్ రామ్, వేలాది మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనగా చైతన్యయాత్రకు సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు క్రిష్. సినిమాలో ఈ సన్నివేశాలు హైలైట్ అవుతాయని చిత్రబృందం భావిస్తోంది. ఫిబ్రవరిలో విడుదల కానున్న ఈ సినిమా షూటింగ్  చివరి దశకు చేరుకుంది.

ఎన్టీఆర్ పాత్రలో హీరో బాలకృష్ణ నటిస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తే జాగర్లమూడి క్రిష్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం తొలి భాగంలో ఎన్టీఆర్ సినీ కెరీర్‌ను చూపించారు. రెండో భాగంలో రాజకీయ నేపథ్యాన్ని చూపించనున్నారు.

ఈ రెండో భాగాన్ని వచ్చే నెల 7వ తేదీన విడుదల చేయాలని భావించారు. కానీ అనివార్య కారణాలరీత్యా దీన్ని వాయిదా వేశారు. అయితే తాజాగా అందిన సమాచారం మేరకు ఈ సినిమాకు ఫిబ్రవరి 14వ తేదీన 'మహానాయకుడు'ని విడుదల చేయాలని నిర్ణయించారు.

ఈ చిత్రంలో బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తే, హరికృష్ణగా కళ్యాణ్ రామ్, అక్కినేని నాగేశ్వర రావుగా సుమంత్, చంద్రబాబు నాయుడుగా రానా దగ్గుబాటి నటిస్తున్నారు. రెండోభాగంలో వీరి పాత్రల నిడివి ఎక్కువగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది.

click me!