సెన్సార్ దెబ్బకి షాక్ లో 'దండుపాళ్యం' టీమ్!

Published : Jan 21, 2019, 12:45 PM IST
సెన్సార్ దెబ్బకి షాక్ లో 'దండుపాళ్యం' టీమ్!

సారాంశం

బెంగుళూరుకి దగ్గరలో దండుపాళ్యకి చెందిన దోపిడీ దొంగల కథ ఆధారంగా 'దండుపాళ్యం'  సినిమాను కొన్ని పార్టులుగా చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే మూడు భాగాలు విడుదలయ్యాయి. ఇప్పుడు నాల్గో భాగం సిద్ధమవుతోంది.   

బెంగుళూరుకి దగ్గరలో దండుపాళ్యకి చెందిన దోపిడీ దొంగల కథ ఆధారంగా 'దండుపాళ్యం'  సినిమాను కొన్ని పార్టులుగా చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే మూడు భాగాలు విడుదలయ్యాయి. ఇప్పుడు నాల్గో భాగం సిద్ధమవుతోంది. ఇటీవల సెన్సార్ కి వెళ్లిన ఈ సినిమాకి పెద్ద షాక్ తగిలింది.

ఈ సినిమాకి రాష్ట్ర సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇవ్వడం కుదరదంటూ సెన్సార్ సభ్యులు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. సినిమాలో చాలా సన్నివేశాలు హింసతో కూడుకొని అసభ్యకరంగా ఉన్నాయని, ఇలాంటి సినిమాలు ప్రజలు చూడడం కష్టమని స్పష్టం చేసింది సెన్సార్ టీమ్.

దీంతో నిర్మాత వెంకటేష్ కర్నాటక చలన చిత్ర వాణిజ్య మండలి, కేంద్ర సెన్సార్ బోర్డ్ కి ఫిర్యాదు చేశారు. దీంతో పరిస్థితులు వివాదాస్పదంగా మారాయి. సెన్సార్ సభ్యులు కావాలనే ఎలాంటి కారణాలు లేకుండా తమ సినిమాను నిరాకరించారని నిర్మాత వెంకటేష్ ఆరోపిస్తున్నారు.

సినిమాలో అభ్యంతకర సన్నివేశాలు ఉంటే వాటిని తొలగించమని చెప్పాలి.. లేదంటే రీషూటింగ్ చేయమని సూచించాలే తప్ప.. అలా చేయకుండా సెన్సార్ బోర్డ్ తమను వేధిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో కోట్లు ఖర్చు చేసి సినిమా తీసి ఐదు భాషలలో విడుదల చేయాలని నిర్ణయిస్తే.. అంతలోనే ఇలా జరిగిందని వాపోయారు. మరి ఈ వివాదం ఎప్పుడు సద్దుమణుగుతుందో చూడాలి!

PREV
click me!

Recommended Stories

Kangana Ranaut Sarees: పార్లమెంట్ ఫ్యాషన్ అదుర్స్.. కంగనా బెస్ట్ శారీ లుక్స్ చూశారా?
Objection My Lord Review: అబ్జెక్షన్‌ మై లార్డ్ వెబ్‌ సిరీస్‌ రివ్యూ.. శ్రీకాంత్‌ కోర్ట్ రూమ్‌ డ్రామా ఎలా ఉందంటే?