Mahaan : ‘మహాన్’మూవీ తెలుగు వెర్షన్ ట్రెలర్ రిలీజ్.. యాక్షన్ థ్రిల్లర్ తో అదరగొట్టిన తండ్రీకొడుకులు

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 03, 2022, 04:56 PM ISTUpdated : Feb 03, 2022, 05:09 PM IST
Mahaan : ‘మహాన్’మూవీ తెలుగు వెర్షన్ ట్రెలర్ రిలీజ్.. యాక్షన్ థ్రిల్లర్ తో అదరగొట్టిన తండ్రీకొడుకులు

సారాంశం

ఆడియెన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మూవీల్లో చియాన్ విక్రమ్ నటించిన ‘మహాన్’ మూవీ ఒకటి. తండ్రీ కొడుకులు తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్న సందర్భంగా ఈ మూవీపై మరింత ఆసక్తి పెరిగింది. తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ మూవీ తెలుగు వెర్షన్ ట్రైలర్ ను రిలీజ్ చేసింది.    

విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే చియాన్ విక్రమ్ ‘మహాన్’ మూవీతో అదరగొట్టనున్నారు. తన కుమారుడు ధృవ్ విక్రమ్ తో కలిసి ఈ సినిమాలో ఆకట్టుకునే యాక్షన్ సీన్లను చూపించనున్నారు. తెలుగులో వచ్చిన  ‘అర్జున్ రెడ్డి’ తమిళ్ రీమేక్ తో ధృవ్ విక్రమ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. తొలిసారిగా తండ్రి, కొడుకులిద్దరూ బిగ్ స్క్రీన్ పై కనిపించబోతుండటంతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిగా పెరుగుతోంది. 

ఈ చిత్రంలో విక్రమ్‌తోపాటు ఆయన కుమారుడు ధృవ విక్రమ్‌ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుండగా,  బాబీ సింహా, సిమ్రాన్‌ లు  కీలక పాత్రలు పోషిస్తున్నారు. కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వం వహించగా, సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియో పతాకంపై లలిత్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని బాగుంటే ఈ చిత్రం థియేటర్లలోనే విడుదల కావాల్సిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కాబోతుంది. ఈ  మేరకు చిత్ర యూనిట్ ఇటీవల అన్ని బాషల్లోని టీజర్స్ రిలీజ్ చేశారు. గతంలో  రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్, టీజర్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. 

 

కాగా తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ‘మహన్’ మూవీ తెలుగు వెర్షన్ టీజర్ ను రిలీజ్ చేసింది. యాక్షన్, థ్రిల్లర్ తో కూడిన ట్రైలర్ ప్రస్తుతం య్యూటూబ్ లో లక్షల వ్యూస్ తో దూసుకుపోతోంది. ‘ఒక మధ్య నిషేధ పోరాట యోధుడి కొడుకు గాంధీమహాన్.. ఈ పాత్రను ‘విక్రమ్’ పోషించాడు. కామర్స్ టీచర్ గా కొనసాగుతున్న ఈయన జీవితం లిక్కర్ బిసినెస్ వైపు మళ్లుతుంది.  గాంధీ మహాన్ ను చక్కపెట్టేందుకు ‘దాదా’ధృవ్ విక్రమ్ ప్రయత్నిస్తుంటాడు.  మద్య నిషేదం పట్ల  తన తండ్రి ఆశయాన్ని గాంధీ మహాన్ నెరవెరుస్తాడా? లేదా? అసలు టీచర్ గా ఉన్న మహాన్ ఎందుకు మద్యం డీలర్ గా మారాడు? గాంధీ మహాన్, ధృవ్ విక్రమ్ తండ్రీ కొడుకులైనప్పటికీ వీరి మధ్య వైర్యం ఎలా ఏర్పడుతుందనేదీ ఈ చిత్రం. ఉత్కంఠభరితమైన యాక్షన్‌ సీన్లు ఈ మూవీలో బాగానే ఉన్నాయి. ముఖ్యంగా ధృవ్ విక్రమ్ ఫిట్ నెస్, నటన ఆకట్టుకునేలా ఉంది. ఎప్పటిలాగే విక్రమ్ తన స్టైల్, అట్రాక్టివ్ లుక్, యాక్టింగ్ తో అదరగొట్టాడు.

అమెజాన్‌ ప్రైమ్‌  సంస్థ  ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్‌ రైట్స్ ని ఇప్పటికే దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు  ఫిబ్రవరి 10న ఈ చిత్రం అన్ని భాషల్లో  ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.  యాక్షన్ థ్రిల్లర్ ఆధ్వర్యంలో తెరకెక్కిన ఈ మూవీని వీక్షించేందుకు ఆడియెన్స్ ఆసక్తిగా ఉన్నారు.  
ప్రస్తుతం విక్రమ్‌ `మహాన్‌`తోపాటు `కోబ్రా`, `పొన్నియిన్‌ సెల్వన్‌ 1` వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. 

PREV
click me!

Recommended Stories

Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌
రూ. 50 లక్షలతో తీస్తే రూ. 100 కోట్లు వచ్చింది.. దుమ్మురేపిన ఈ చిన్న సినిమా ఏంటో తెలుసా.?