గుండెపోటుతో పాపులర్‌ సీనియర్‌ నటుడు కన్నుమూత..

Published : Feb 03, 2022, 04:39 PM IST
గుండెపోటుతో పాపులర్‌ సీనియర్‌ నటుడు కన్నుమూత..

సారాంశం

 ప్రముఖ నటుడు రమేష్‌ డియో కన్నుమూశారు. హిందీ, మరాఠి సినిమాల్లో ఎక్కువగా నటించిన ఆకట్టుకున్న రమేష్‌ డియో(93) బుధవారం హార్ట్ ఎటాక్‌తో ముంబయిలోని కోకిలా బేన్‌ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 

బాలీవుడ్‌, మరాఠి చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు రమేష్‌ డియో కన్నుమూశారు. హిందీ, మరాఠి సినిమాల్లో ఎక్కువగా నటించిన ఆకట్టుకున్న రమేష్‌ డియో(93) బుధవారం హార్ట్ ఎటాక్‌తో ముంబయిలోని కోకిలా బేన్‌ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో అలనాటి నటుడి మరణంతో బాలీవుడ్‌, మరాఠి చిత్ర పరిశ్రమల్లో విషాదం నెలకొంది. రమేష్‌ డియో మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం తెలియజేస్తున్నారు.

రమేష్‌ డియోకి భార్య సీమా డియో, ఇద్దరు కుమారులు అజింక్యా డియో, అభినయ్‌ డియోలున్నారు. రమేష్‌ డియో ఇటీవల జనవరి 30నే తన 93వ పుట్టిన రోజుని జరుపుకున్నారు. బర్త్ డే సెలబ్రేట్‌చేసుకున్న నాలుగు రోజుల్లోనే ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం అత్యంత బాధాకరం. తండ్రి మరణం గురించి కుమారుడు అజింక్యా డియో తెలియజేస్తూ, తండ్రి రమేష్‌ డియో కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని, శ్వాసతీసుకోవడం ఇబ్బందిగా ఉందని చెప్పడంతో బుధవారం ఆసుపత్రిలో చేర్పించామని, కానీ హార్ట్ ఎటాక్‌తో బుధవారం సాయంత్రం కన్నుమూశారని తెలిపారు. గురువారం అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

రమేష్‌ డియో బాలీవుడ్‌, మరాఠి సినిమాలతోపాటు టీవీ సీరియల్స్ లోనూ నటించారు. అనేక విభిన్న పాత్రలు పోషించి ఆకట్టుకున్నారు. దాదాపు ఆరున్నర దశాబ్దాల సినీ జీవితంలో ఆయన 450కిపైగా చిత్రాల్లో నటించడం విశేషం. అందులో 285 హిందీ సినిమాలు, 190 మరాఠి చిత్రాలు, 30 మరాఠి డ్రామాలు, 200 షోస్‌లో పార్టిసిపేట్‌ చేశారు. పలు చిత్రాలనునిర్మించారు కూడా. అదే సమయంలో 250కిపైగా యాడ్‌ ఫిల్మ్స్ లోనూ నటించారు. పలు చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. అందులో `ఘోస్టా లగ్ననంటచి` చిత్రం మంచి ఆదరణ పొందింది. 

ఆయన నటించిన చిత్రాల్లో `భాగ్యలక్ష్మి`, `ఆర్తి`, `డస్‌ లాక్‌`, `మెహర్భన్‌`, `శిఖర్‌`, `షికర్‌`, `సరస్వతిచంద్రా`, `తీన్‌ మహురనియన్‌`, `మస్తానా`, `కోషిష్‌`, `బీస్‌ సాల్‌ పెహ్లే`, `ధర్మా`, `ఫకీర్‌`, `రాయీస్‌`, `ఆజ్‌ కా మహత్మా`, `హేయి హై జిందగీ`, `డ్రీమ్‌ గర్ల్`, `కాలేజ్‌ గర్ల్`, `సర్జా`, `కభీ అజ్నాబి తే`, `ఇల్జామ్‌`, `లైలా`, `మేరా యార్‌ మేరా దుష్మన్‌`, `మిస్టర్‌ ఇండియా`, `సిందూర్‌`, `తుఫాన్‌`, `అజాద్‌ దేశ్‌ కే గులామ్‌`, `ఘరానా`, `ఘయాల్`, ఇటీవల కాలంలో `జాలీ ఎల్‌ఎల్‌బీ`, `చాండి` వంటి చిత్రాల్లో నటించారు. తనయుడు అభినయ్ దర్శకుడిగా రాణిస్తున్నారు. ఆయన `ఢిల్లీ బెల్లీ`, `ఫోర్స్ 2`, `బ్లాక్‌ మెయిల్‌`, మరో కుమారుడు అజింక్యా నటుడిగా రాణిస్తున్నారు. ఆయన `ఆన్‌`, `తానాజీ` వంటి చిత్రాల్లో నటించారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Nivetha Thomas: రష్మిక, శ్రీలీల, ఇప్పుడు నివేదా థామస్‌.. ఏఐ ఫేక్‌ ఫోటోలకు బలి.. నటి స్ట్రాంగ్‌ వార్నింగ్
Illu Illalu Pillalu Today Episode Dec 18: ఇంట్లో పెద్ద చిచ్చే పెట్టిన వల్లి, ధీరజ్ పై కత్తి ఎత్తిన ప్రేమ