`మహాభారత్‌` నటుడు కన్నుమూత.. విషాదంలో బాలీవుడ్‌

Published : Jun 05, 2023, 04:06 PM IST
`మహాభారత్‌` నటుడు కన్నుమూత.. విషాదంలో బాలీవుడ్‌

సారాంశం

బాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. `మహాభారత్‌` నటుడు గుఫీ పైంతాల్‌ కన్నుమూసింది. `మహాభారత్‌`లో శకుని మామగా గుర్తింపు తెచ్చుకున్న  ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు. 

దేశంలో అత్యంత ఆదరణ పొందిన సీరియల్‌గా `మహాభారత్‌` నిలిచింది. ఇందులో శకుని మామగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు గుఫీ ఫైంతాల్‌(78) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశారు. ఈ విషయాన్ని పైంతాల్‌ మేనల్లుడు హిటెన్‌ వెల్లడించారు. 

గుఫీ ఫైంతాల్‌ అసలు పేరు సరబ్జిత్ సింగ్‌ పైంతాల్‌. నటుడు కావడానికి ముందు ఆయన ఆర్మీలో పనిచేశారు. బాలీవుడ్‌లో తెరకెక్కిన ఎన్నో సినిమాలు, సీరియల్స్ లో ఆయన నటించారు. `మహాభారత్‌` సీరియల్‌ ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టింది. దీంతోపాటు `బహదూర్‌ షా జఫర్‌`, `కానూన్‌`, `ఓం నమ శివాయ`, `సీఐడీ`, `కోయి హై ద్వారకాధీష్‌ భగవాన్‌ శ్రీ కృష్ణ`, `రాధాకృష్ణ` లో నటించారు. ఆయన చివరగా `జై కన్నయ్య లాల్‌ కీ`లో నటించారు. 

వీటితోపాటు `రఫూ చక్కర్‌`తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత `దిల్లాగి`, `దేశ్‌ పరదేశ్‌`, `సుహాగ్‌` వంటి చిత్రాల్లో నటించాడు. ఇక గుఫీ పైంతాల్‌ మృతి పట్ల బాలీవుడ్‌ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. గుఫీకి కొడుకు, కోడలితోపాటు ఓ మనవడు ఉన్నారు. గుఫీ అంత్యక్రియలు అంథేరి సబర్బన్‌లోని శ్మశానవాటికలో ఈ సాయంత్రం నిర్వహించనున్నారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

విజయ్, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ లో చిరు, కేటీఆర్, నాని, వెంకీ, నాగ్ సందడి.. టాలీవుడ్ మొత్తం తరలివచ్చిందిగా
Vijay Divorce: భార్యకి విజయ్‌ రూ.250 కోట్ల భరణం.. దళపతి విడాకుల కేసులో ఊహించని ట్విస్ట్