సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) పుట్టిన రోజు వేడుకలు నిన్న జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా స్టార్స్, ఫ్యాన్స్ ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కానీ ఎన్టీఆర్ మాత్రం అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు.
కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి కేజీఎఫ్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఇండియన్ టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చోటు దక్కించుకున్నారు. కేజీఎఫ్ తో కొత్త చరిత్రను రాశారు. సరికొత్త రికార్డులను సృష్టించారు. దీంతో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే నిన్న ప్రశాంత్ నీల్ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. డార్లింగ్ ప్రభాస్ (Prabhas) దగ్గరుండి కేక్ కట్ చేయించారు. స్పెషల్ విషెస్ తెలిపారు.
అలాగే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ప్రశాంత్ నీల్ కు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కానీ ఎన్టీఆర్ మాత్రం సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టలేదు. సామాజిక మాద్యమంలో ప్రశాంత్ నీల్ ను విష్ చేయలేదు. కానీ ఊహించని విధంగా ప్రశాంత్ నీల్ ను సర్ ప్రైజ్ చేశారు. తమ ఇంట్లో వండిన నాటుకోడి పులుసును ప్రత్యేకంగా ప్రశాంత్ నీల్ కోసం పంపించారు. ఈ విషయాన్ని ప్రశాంత్ నీల్ భార్య లిఖితా రెడ్డి స్వయంగా తెలిపింది. స్పెషల్ ఫుడ్ పంపించినందుకు తారక్ కు అన్నయ్య అంటూ ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
ఈ పోస్ట్ చూసిన తారక్ అభిమానులు వైరల్ చేస్తున్నారు. తారక్ - ప్రశాంత్ నీల్ బాండ్ అలాంటిదంటూ పొంగిపోతున్నారు. ఇక ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ తో ‘సలార్’ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. మరో మూడు నెలల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం తుదిదశ షూటింగ్ జరుపుకుంటోంది. సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. వచ్చే ఏడాది మార్చిలో NTR31 షూటింగ్ ప్రారంభం కానుంది. ఇటు ఎన్టీఆర్ NTR30లో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా.. జాన్వీ హీరోయిన్ గా నటిస్తోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. 2024 ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.