విశాల్‌కి మద్రాస్‌ హైకోర్ట్ షాక్‌.. `చక్ర` విడుదలపై స్టే..

Published : Feb 16, 2021, 06:27 PM ISTUpdated : Feb 16, 2021, 06:33 PM IST
విశాల్‌కి మద్రాస్‌ హైకోర్ట్ షాక్‌.. `చక్ర` విడుదలపై స్టే..

సారాంశం

హీరో విశాల్‌కి కోర్ట్ షాక్‌ ఇచ్చింది. ఆయన హీరోగా నటిస్తున్న `చక్ర` చిత్రం చిక్కుల్లో పడింది. ఈ సినిమాపై మద్రాస్‌ హైకోర్ట్ స్టే విధించింది. ఈ చిత్ర కథ హక్కులు తమవే అంటూ నిర్మాత రవి మద్రాస్‌ హైకోర్ట్ ని ఆశ్రయించగా, మంగళవారం కోర్ట్ స్టే విధించింది. తదుపరి విచారణ ఈ నెల 18కి వాయిదా వేసింది. 

హీరో విశాల్‌కి కోర్ట్ షాక్‌ ఇచ్చింది. ఆయన హీరోగా నటిస్తున్న `చక్ర` చిత్రం చిక్కుల్లో పడింది. ఈ సినిమాపై మద్రాస్‌ హైకోర్ట్ స్టే విధించింది. ఈ చిత్ర కథ హక్కులు తమవే అంటూ నిర్మాత రవి మద్రాస్‌ హైకోర్ట్ ని ఆశ్రయించగా, మంగళవారం కోర్ట్ స్టే విధించింది. తదుపరి విచారణ ఈ నెల 18కి వాయిదా వేసింది. ఈ చిత్రానికి ఎం.ఎస్‌.ఆనందన్‌ దర్శకత్వం వహించారు. విశాల్‌ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై విశాల్‌ నిర్మించారు. 

ఇందులో విశాల్‌ సరసన శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్‌గా నటించింది. రెజీనా కీలక పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాని తమిళంతోపాటు తెలుగులోనూ తెరకెక్కించారు. ఈ నెల 19న విడుదల చేయబోతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరిగింది. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు. డిజిటల్‌ క్రైమ్స్ నేపథ్యంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. 

ఈ చిత్ర తనదని గతంలో విశాల్‌తో `యాక్షన్‌` చిత్రాన్ని నిర్మించిన ట్రిడెంట్‌ ఆర్ట్స్ నిర్మాత రవింద్రన్‌ ఆరోపిస్తున్నారు. ఈ కథ హక్కులకు సంబంధించి తనకు చెల్లిస్తానని చెప్పి అమౌంట్‌ని ఇంకా విశాల్‌ చెల్లించలేదని, ఇచ్చిన మాట తప్పారని రవింద్రన్‌ ఆరోపిస్తున్నారు. అంతేకాదు `చక్ర` సినిమాని తనకే నిర్మించే అవకాశం ఇస్తానని, మాటతప్పారనే వాదనలతో రవింద్రన్‌ కోర్ట్ ని ఆశ్రయించారని సమాచారం. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

రూ. 50 లక్షలతో తీస్తే రూ. 100 కోట్లు వచ్చింది.. దుమ్మురేపిన ఈ చిన్న సినిమా ఏంటో తెలుసా.?
Sitara-Balakrishna: సితార ఘట్టమనేని మిస్‌ చేసుకున్న బాలకృష్ణ సినిమా ఏంటో తెలుసా? మంచే జరిగింది