వెంటనే అరెస్ట్ చేయండి..శరత్ కుమార్ - రాధారవిలకు షాకిచ్చిన హై కోర్ట్

Published : May 05, 2019, 02:03 PM IST
వెంటనే అరెస్ట్ చేయండి..శరత్ కుమార్ - రాధారవిలకు షాకిచ్చిన హై కోర్ట్

సారాంశం

ప్రముఖ నటులు శరత్‌కుమార్‌, రాధారవికి మద్రాసు హైకోర్టు షాకిచ్చింది. వెంటనే వారిని అరెస్ట్ చేయాలనీ ఉత్తర్వులు జారీచేయడంతో ఒక్కసారిగా ఈ న్యూస్ కోలీవుడ్ లో అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. 

ప్రముఖ నటులు శరత్‌కుమార్‌, రాధారవికి మద్రాసు హైకోర్టు షాకిచ్చింది. వెంటనే వారిని అరెస్ట్ చేయాలనీ ఉత్తర్వులు జారీచేయడంతో ఒక్కసారిగా ఈ న్యూస్ కోలీవుడ్ లో అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. 

అసలు మ్యాటర్ లోకి వెళితే.. 2017 కి ముందు తమిళ నటీనటుల సంఘానికి శరత్ కుమార్ అధ్యక్షుడిగా ఉన్నారు. రాధారవి కార్యదర్శిగా కొనసాగారు. అయితే ఆ సమయంలో నడిగర్‌ సంఘానికి చెందిన ఒక స్థలాన్ని ఎవరికీ తెలియకుండా అక్రమంగా అమ్మసినట్లు 2017లో ఓ వ్యక్తి హై కోర్టును ఆశ్రయించాడు. 

కాంచీపురం జిల్లా పరిధిలోని వెంకటామంగళంలో ఉన్న స్థలాన్ని అమ్మేసినట్లు అప్పట్లో శరత్ కుమార్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇక ఈ విషయంపై వేసిన పిటిషన్ ను కోర్టు శనివారం విచారణ జరిపించింది. మూడు నెలల్లో కేసును తేల్చాలని వెంటనే శరత్ - రాధారవిలను అరెస్ట్ చేయాల్సిందిగా కోర్టు పోలీసులను ఆదేశించింది.  

PREV
click me!

Recommended Stories

The Raja Saab కథ లీక్‌ చేసిన ప్రభాస్‌, హైలైట్‌ ఇదే.. తాను పనిచేసిన డైరెక్టర్స్ గురించి క్రేజీ వర్డ్స్
Prabhas: పెళ్లి ఎందుకు చేసుకోలేదో చెప్పిన ప్రభాస్‌, ఎవరూ ఊహించరు.. `స్పిరిట్‌` లుక్‌ మైండ్‌ బ్లోయింగ్‌