
తెలుగు నవలా రచయిత మధుబాబు తెలుగు పాఠకలోకానికి బాగా సుపరిచితమే. 1970లో తన రచనలు ప్రారంభించిన మధుబాబు ప్రత్యేక రచనా పటిమతో పాఠక హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారు. అద్భుతమైన నవలలతో ఆకట్టుకుంటున్నారు. ఇప్పటివరకు ఆయన ఇంచు మించు 250కిపైగా నవలలు రచించగా, అందులో 150కిపైగా `షాడో`, `గంగారం` పాత్రలు పాఠక హృదయాల్లో స్థానాన్ని సుస్థిర పరుచుకున్నాయి. నేటికీ ఆయన కలం నిర్విరామంగా స్వాతి, నవ్య, కినిగి, సహారి వంటి మాధ్యమాలలో కొనసాగుతూనే ఉంది.
పుస్తక పఠనానికి దూరమై, మంచి కథనాలను, మంచి చెడుల తారతమ్యాలను మిస్ అవుతున్న నేటి తరం యువతని దృష్టిలో పెట్టుకుని, తన పుస్తకాల పైరసీకి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు ఓ అద్భుతమైన ఆలోచనతో ముందుకొచ్చారు. తన రచనలు అందరికి రీచ్ అయ్యేలా శ్రవణానంద భరితంగా అందించే ఉద్దేశ్యంతో మధుబాబుకి వచ్చిన అద్భుతమైన ఆలోచనే `ఆడియో బుక్స్ కాన్సెప్ట్. `షాడో మధుబాబు ఆడియో బుక్స్` పేరుతో ఆయన తన రచనలను ఆడియో ద్వారా పాఠక శ్రోతలకు అందించబోతున్నారు. పాఠక వీక్షకులు తమ ప్రయత్నాన్ని స్వాగతించి, ఇప్పటి వరకు తనకి పాఠకులు అందించిన ప్రోత్సాహాన్ని కొనసాగిస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు మధుబాబు.
ఇక ఈ ఆడియో రికార్డింగ్స్ లో ఒక్కో నవలని ముప్పై నిమిషాలు గల భాగాలుగా తీసుకు వస్తున్నట్టు వెల్లడించారు. త్వరలోనే వీటిని పాఠకుల ముందుకు తీసుకువస్తామని చెప్పారు. `షాడో అభిమానులందరికీ షాడో అడ్వెంచర్స్ తో పాటు, నా folklore, fantasy నవలలు సుపరిచితమే. 'షాడో' ని ఫాంటసీ ప్రపంచంలోకి పంపిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనకు రూపమే ఈ సిరీస్, రాచరికాలూ, కత్తియుద్ధాలూ, గుర్రపు స్వారీలూ, రాజకుమార్తెలూ, రాజదర్బారుల కాలంలోకి, షాడో Time Travel చేస్తే, అక్కడ అతని ప్రవర్తన ఎలా వుంటుందనే అభిమానుల ప్రశ్నలకు సమాధానమే, ఈ "చిచ్చర పిడుగు, డాగర్ ఆఫ్ షాడో" నవలలు.
ఈ కథలో మాదిరిగా నిజంగా జరుగుతుందా? అనే విషయాన్ని పక్కన పెట్టి, సరదాగా షాడోతో పాటు ఒకసారి మీరు కూడా ఆ కాలంలోకి వెళ్లి రండి. అప్పటి పరిస్థితులకు ఎడ్జెస్ట్ కావటానికి షాడో పడ్డ పాట్లను గమనించండి. చతుర్నేత్రుడు తరువాత ప్రారంభం కాబోతున్న 'చిచ్చర పిడుగు' ని ఫాలో అయ్యి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి` అని రైటర్ మధుబాబు కోరుకున్నారు. `షాడో మధుబాబు` యూట్యూబ్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకుని తమ రచనలను ఎప్పటిలాగే ఆదరించాలని ఆయన వేడుకున్నారు.
Shadow Madhu Babu Audiobooks (Official) : https://www.youtube.com/smbab
గాత్రం: సుధా దిలీప్ నృసింహదేవర
రచన: మధుబాబు
నిర్మాణ నిర్వహణ, కూర్పు: మహీధర్ వల్లభనేని (MPLANETLEAF)