సౌందర్యకు తల లేదు, చేతి వాచ్ చూసి గుర్తించారు... ఆమె డెడ్ బాడీ చూసి షాక్ అయ్యాను!

Published : Apr 14, 2023, 12:44 PM IST
సౌందర్యకు తల లేదు, చేతి వాచ్ చూసి గుర్తించారు... ఆమె డెడ్ బాడీ చూసి షాక్ అయ్యాను!

సారాంశం

సౌందర్య మరణం ఊహించని పరిణామం. పదేళ్ల పాటు పరిశ్రమను ఏలిన సౌందర్య ప్రమాదంలో కన్నుమూశారు. సౌందర్యను చివరి చూపు కూడా చూడలేకపోయామని నటి ప్రేమ దిగ్భ్రాంతికర సంగతులు పంచుకున్నారు.   

సీనియర్ హీరోయిన్ ప్రేమ లేటెస్ట్ ఇంటర్వ్యూలో పలు విషయాలు ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ క్రమంలో సౌందర్యతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆమె మరణం అత్యంత విషాదకరమని వాపోయారు. సౌందర్యను చివరి చూపు చూడటానికి ఆమె నివాసానికి వెళ్ళాను. సౌందర్య, ఆమె తమ్ముడు డెడ్ బాడీస్ బాక్సులలో ఉంచారు. సౌందర్యకు తల లేదు. కేవలం ఆమె పెట్టుకున్న వాచ్ ని చూసి సౌందర్య డెడ్ బాడీ అని గుర్తించారని... ప్రేమ అన్నారు. 

సౌందర్య ఎప్పుడూ అందంగా కనిపించడానికి ఇష్టపడతారు. షూటింగ్ లో షాట్ గ్యాప్ లో కూడా మేకప్ టచ్ అప్ చేసుకునేవారు. లుక్ పర్ఫెక్ట్ గా ఉండాలనుకునేవారు. అలాంటి సౌందర్య చివరి క్షణాలు దారుణంగా గడిచాయి. ఆమెకు తల లేకుండా పోయింది. సౌందర్య మరణం తర్వాత జీవితం అంటే ఇంతేనా అనిపించింది. ఆర్టిస్ట్ జీవితాలు ఇంతే. మనం చనిపోయాక పట్టుకుపోయేది కర్మ, గౌరవం మాత్రమే అని ప్రేమ అన్నారు. 

2004 ఏప్రిల్ 17న సౌందర్య  విమాన ప్రమాదంలో మరణించారు. అప్పటికి సౌందర్య వయసు కేవలం 31 ఏళ్ళు మాత్రమే. బీజేపీ పార్టీలో చేరిన సౌందర్య ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగుళూరు నుండి కరీంనగర్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సౌందర్యతో పాటు ఆమె తమ్ముడు కూడా ప్రమాదంలో మరణించారు. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?