పవన్ నుండి పిలుపొస్తే అప్పుడు.. మాధవీలత కామెంట్స్!

Published : Oct 31, 2018, 12:18 PM ISTUpdated : Oct 31, 2018, 12:21 PM IST
పవన్ నుండి పిలుపొస్తే అప్పుడు.. మాధవీలత కామెంట్స్!

సారాంశం

సినిమా రంగంలో నటిగా కొన్ని సినిమాలలో నటించిన మాధవీలత ఇటీవల బిజేపీ పార్టీలో చేరింది. అయితే ఆమెకి పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టమని  ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలలో వెల్లడించింది. కానీ రాజకీయాలకి వచ్చేసరికి మాత్రం ఆమె పవన్ జనసేన పార్టీ కాకుండా బీజేపీలో చేరింది. 

సినిమా రంగంలో నటిగా కొన్ని సినిమాలలో నటించిన మాధవీలత ఇటీవల బిజేపీ పార్టీలో చేరింది. అయితే ఆమెకి పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టమని 
ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలలో వెల్లడించింది.

కానీ రాజకీయాలకి వచ్చేసరికి మాత్రం ఆమె పవన్ జనసేన పార్టీ కాకుండా బీజేపీలో చేరింది. బీజేపీలో ఉన్నప్పటికీ పవన్ మీద ఉన్న అభిమానం మాత్రం తగ్గదని అంటోంది మాధవీలత. చిన్నప్పటి నుండి మెగాస్టార్ చిరంజీవిని ఎంతగానో అభిమానించేదాన్నని.. 

ఆ తరువాత పవన్ వ్యక్తిత్వం, ఆలోచన విధానం పట్ల ఆకర్షితురాలినయ్యానంటూ చెప్పుకొచ్చింది. అయితే పవన్ పిలిస్తే జనసేనలో జాయిన్ అవుతారా..? అనే ప్రశ్నకి సమాధానంగా.. పవన్ నుండి పిలుపు వస్తే మాత్రం జనసేన విషయమై ఆలోచిస్తానని వెల్లడించింది. అయితే బీజీపీ నేషనల్ పార్టీ కాబట్టి ఎన్నో విషయాలను నేర్చుకునే అవకాశం ఉంటుందని ఆ కారణంగానే బీజేపీలో చేరినట్లు స్పష్టం చేసింది. 

PREV
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్