నీ బండారం బయటపెడతా.. శ్రీరెడ్డి కామెంట్స్!

Published : Oct 31, 2018, 11:42 AM IST
నీ బండారం బయటపెడతా.. శ్రీరెడ్డి కామెంట్స్!

సారాంశం

గత కొద్దిరోజులుగా నటి శ్రీరెడ్డి తమిళ ఇండస్ట్రీలో ప్రముఖ నటుడు, నడిగర్ సంఘంలో కీలక వ్యక్తి అంటూ ఒకరిపై ఆరోపణలు చేస్తుంది. రెండు రోజుల క్రితం ఆ వ్యక్తి రంగు, ఎత్తు తనకు తెలుసని.. అతడు హీరోయిన్స్ తో పాటు సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లను కూడా లైంగికంగా వేధించాడని.. దానికి తగ్గ ఆధారాలు తన దగ్గరున్నాయని వెల్లడించింది. 

బయటకి మాత్రం మిస్టర్ పెర్ఫెక్ట్ గా నటిస్తోన్న అతడిని విడిచిపెట్టను అంటూ కామెంట్స్ చేసింది. మరోసారి అదే వ్యక్తిని టార్గెట్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి. ''మంగళవారం నాడు టీవీలో మీ ప్రసంగాన్ని విన్నాను.. అసలు ఈ రూపాన్ని మరచి మంచివ్యక్తిగా కబుర్లు బాగానే చెబుతున్నావు.

నీ అసలు రంగు బయటపెడతాను. నా వద్ద ఆధారాలు ఉన్నాయి. పరిశ్రమలోని ప్రముఖ నటీమణుల నుండి సహాయ నటీమణుల వరకు అందరినీ వేధించావు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్ గా, నడిగర్ సంఘంలో సభ్యుడిగా నువ్వు తమిళ మీడియాని మ్యానేజ్ చేయగలవేమో కానీ నన్ను మాత్రం చేయలేవు.. త్వరలోనే నువ్వు ఇబ్బందులను ఎదుర్కొంటావు'' అంటూ వెల్లడించింది. 

ఇది కూడా చదవండి.. 

'కౌంట్ డౌన్ స్టార్ట్' అంటూ ఆ హీరోకి శ్రీరెడ్డి హెచ్చరిక, ఊరుకుంటాడా?

PREV
click me!

Recommended Stories

IMDb రిపోర్ట్ ప్రకారం 2025 లో టాప్ 10 పాపులర్ సినిమాలు ఏవంటే?
Akhanda 2 Premiers: అఖండ 2 చిత్రానికి మరో కోలుకోలేని దెబ్బ.. ప్రీమియర్ షోల అనుమతి రద్దు చేసిన హైకోర్టు