చివరికి టీమ్ సెర్చింగ్ మాధవన్ దగ్గరకు వచ్చి ఆగిందని సమాచారం. ఈ మేరకు మాధవన్ తో ఇప్పటికే డిస్కషన్స్ జరిపినట్లు తెలుస్తోంది.
స్టార్ సినిమా విషయంలో హీరో,నిర్మాత తర్వాత ఎక్కువ టెన్షన్ పెట్టుకునేది ఎవరూ అంటే ఫ్యాన్స్ అనే చెప్పాలి. తమ హీరో సినిమా సూపర్ హిట్ కావాలని,రికార్డ్ లు బ్రద్దలు కొట్టాలని నిత్య పూజలు కూడా నిర్వహించే స్దాయిలో ఉంటారు కొందరు అభిమానులు. దాంతో సినిమా ప్రారంభమైన నాటినుంచి అందుకు సంభందించిన ప్రతీ అప్ డేట్ కు స్పందిస్తూంటారు. ఆనందపడుతూంటారు..టెన్షన్ పడుతూంటారు..రిలీజ్ అయ్యాక రికార్డ్ లు క్రియేట్ చేస్తూంటే చూసి గర్వపడుతూంటారు. మహేష్ ఫ్యాన్స్ కూడా అదే బాపతు. సోషల్ మీడియాలో ఏక్టివ్ గా ఉండే వీరు తమ హీరో చేస్తున్న సినిమాకు సంభందించిన వార్త ఏదైనా వస్తే డిస్కషన్స్ మొదలెట్టేస్తూంటారు. ఆ క్రమంలో ఇప్పుడు ఓ వార్త వారిని టెన్షన్ లో పడేస్తోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరుశరామ్ దర్శకత్వంలో ‘సర్కారువారిపాట’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ఇప్పటిదాకా విలన్ ఎవరనేది ఫైనలైజ్ చేయలేదు. అరవింద్ స్వామి, అనీల్ కపూర్ ఇలా చాలా పేర్లు వినిపించాయి. అయితే వీళ్ళవెరి డేట్స్ అందుబాటులో లేవు. చివరికి టీమ్ సెర్చింగ్ మాధవన్ దగ్గరకు వచ్చి ఆగిందని సమాచారం. ఈ మేరకు మాధవన్ తో ఇప్పటికే డిస్కషన్స్ జరిపినట్లు తెలుస్తోంది.
ఇందులో నిజమెంతముందో తెలియదు కానీ.. టాక్ అయితే మాత్రం బాగానే వినిపిస్తోంది. జనం సొమ్ముని మోసం చేసి విదేశాలకు పారిపోయే బ్యాంక్ ఛైర్మన్ రోల్‌లో మాధవన్ నటిస్తున్నాడని సమాచారం. అయితే మరో మెయిన్ విలన్ కూడా ఉన్నాడని చెప్తున్నారు. దాంతో మాధవన్ పాత్ర నిడివి ఎంత సేపు ఉంటుందనేది కూడా తెలియటం లేదు.
ఇక మాధవన్ ఈ సినిమాలో నటించబోతున్నాడు అనగానే ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైంది. ఇప్పటికే మాధవన్ విలన్ గా నటించిన సవ్యశాచి, నిశ్శబ్దం రెండూ చీదేసాయి. దాంతో ఇప్పుడు అదే మాధవన్ మళ్లీ విలన్ పాత్రలో తమ సినిమాకు అనేసరికి ఫ్యాన్స్ మధ్యలో డిస్కషన్స్ మొదలయ్యాయి. అయితే కొందరు పాజిటివ్ గానే స్పందిస్తున్నారు. కథ బాగోనిదే మాధవన్ ఏం చేస్తాడని, ఆ రెండు సినిమాల్లో మాధవన్ తన పాత్ర బాగానే పోషించాడని మరికొందరు అంటున్నారు.మాధవన్ మల్టీ ట్యాలెంటడ్ కావటంతో తో చాలా స్కిల్స్ వున్నాయి.
దర్శకుడిని నమ్మి అతని విజన్‌ను మెరుగుపరిచే ఓ గొప్ప నటుడు. ఖచ్చితంగా మాధవన్ స్టార్‌డం ఈ ప్రాజెక్ట్ విలువను మరింత పెంచుతుందని ఆయన అభిమానులు అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో రీసెంట్ గానే ప్రారంభమైంది. ఇరవై రోజుల పాటు జరగనుందని సమాచారం. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ దుబాయిలో జరిగింది.