పోలీస్ అధికారిపై చీటింగ్ కేసు పెట్టిన హీరోయిన్

Published : Apr 16, 2021, 07:50 AM IST
పోలీస్ అధికారిపై చీటింగ్ కేసు పెట్టిన హీరోయిన్

సారాంశం

సుందరం ట్రావెల్స్ మూవీతో హీరోయిన్ గా కోలీవుడ్ కి పరిచయమైన నటి రాధకు సబ్ ఇన్స్పెక్టర్ వసంత్ రాజ్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధం గా మారింది.


కోలీవుడ్ కి చెందిన వర్ధమాన నటి రాధ పోలీసు స్టేషన్ మెట్లెక్కారు. తనను ఓ పోలీస్ అధికారి మోసం చేశాడంటూ ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే... సుందరం ట్రావెల్స్ మూవీతో హీరోయిన్ గా కోలీవుడ్ కి పరిచయమైన నటి రాధకు సబ్ ఇన్స్పెక్టర్ వసంత్ రాజ్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధం గా మారింది. 

పెళ్ళై విడాకులు తీసుకున్న రాధ, పెళ్ళై పిల్లల ఉన్న వసంత రాజ్ కి దగ్గరయ్యారు. రాధ కోసం ఎస్ ఐ వసంత రాజ్  తిరువాన్మీయూరు నుంచి వడపళని స్టేషన్ కి పోస్టింగ్ మార్పించుకున్నారు. రాధ కారణంగా తన భర్త కుటుంబాన్ని, పిల్లలను పట్టించుకోవడం లేదని గతంలో వసంత రాజ్ భార్య పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 


వీరి మధ్య పెరిగిన అనుబంధం నేపథ్యంలో వసంత రాజ్ పేరును తనకు భర్తగా, పిల్లలకు తండ్రిగా ఆధార్ కార్డులో రాధ నమోదు చేయించారు. ఇది తెలుసుకున్న వసంత రాజ్ ఆమెను దూరం పెట్టడం ప్రారంభించారు. తన పోస్టింగ్ కూడా ఆమెకు దూరంగా ఎన్నూరుకు మార్పించుకున్నాడు. కావాలనే వసంత రాజ్ తనను దూరం పెడుతున్నాడని గ్రహించిన రాధ పోలీస్ స్టేషన్ లో అతనిపై ఫిర్యాదు చేశారు. వసంత రాజ్ కి తనకు వివాహం జరిగిందని ఆమె ఆరోపిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Sanjana Remuneration : విన్నర్ రేంజ్ లో పారితోషికం అందుకున్న సంజన గల్రానీ, 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఎంత ఇచ్చారంటే?
Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి