ఓవర్‌టేక్ వల్లే ప్రమాదం.. సాయి తేజ్ వద్ద టూ వీలర్ లైసెన్స్ దొరకలేదు : పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు

By Siva KodatiFirst Published Sep 11, 2021, 9:26 PM IST
Highlights

సినీ హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదంపై కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. రోడ్డు ప్రమాదం సమయంలో సాయి ధరమ్ తేజ్ 78 కిలోమీటర్ల స్పీడుతో వెళ్తున్నాడని మాదాపూర్ డీసీపీ పేర్కొన్నారు. అలాగే దుర్గం చెరువుపై 102 కిలోమీటర్ల వేగంతో బైక్ నడిపారని డీసీపీ వెల్లడించారు. రాష్ డ్రైవింగ్‌తో పాటు నిర్లక్ష్యంగా బైక్‌ను నడిపారని ఆయన చెప్పారు. 

సినీ హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదంపై కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. సాయి సెకండ్ హ్యాండ్ బైక్‌ను కొనుగోలు చేశారని.. బైక్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఇంకా పూర్తి కాలేదన్నారు మాదాపూర్ డీసీపీ. గతంలో మాదాపూర్‌లోని పర్వతాపూర్ వద్ద ఓవర్ స్పీడ్‌కు సంబంధించి ఈ బైక్‌కు రూ.1,135 చలానా వేశామని.. దీనిని ఇవాళ సాయి ధరమ్ తేజ్ కుటుంబసభ్యులు క్లియర్ చేశారని చెప్పారు. ఎల్బీ నగర్‌కు చెందిన అనిల్ కుమార్ అనే వ్యక్తి నుంచి సాయి ఈ బైక్‌ను కొనుగోలు చేశారని డీసీపీ వెల్లడించారు. 

Also Read:నరేష్‌ వ్యాఖ్యలపై శ్రీకాంత్‌ అభ్యంతరం.. రేసింగ్‌కి కాదంటూ సాయిధరమ్‌తేజ్‌ ప్రమాదంపై నరేష్‌ వివరణ

అనిల్ కుమార్‌ను కూడా పిలిపించి విచారణ జరుపుతున్నామని ఆయన తెలిపారు. బైక్ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపామని మాదాపూర్ డీసీపీ వెల్లడించారు. రోడ్డు ప్రమాదం సమయంలో సాయి ధరమ్ తేజ్ 78 కిలోమీటర్ల స్పీడుతో వెళ్తున్నాడని ఆయన పేర్కొన్నారు. అలాగే దుర్గం చెరువుపై 102 కిలోమీటర్ల వేగంతో బైక్ నడిపారని డీసీపీ వెల్లడించారు. రాష్ డ్రైవింగ్‌తో పాటు నిర్లక్ష్యంగా బైక్‌ను నడిపారని ఆయన చెప్పారు. ఆటోను లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్ టేక్ చేయబోయి స్కిడ్డ్ అయి సాయి కిందపడ్డారని డీసీపీ వివరించారు. తేజ్ వద్ద టూ వీలర్ నడిపై డ్రైవింగ్ లైసెన్స్ లభ్యం కాలేదన్నారు. లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ చేసే లైసెన్స్ మాత్రమే వుందని ఆయన చెప్పారు. ప్రమాద సమయంలో సాయి తేజ్ హెల్మెట్ ధరించి వున్నారని తెలిపారు. 
 

click me!