
హీరో మంచు విష్ణు (Manchu Vishnu)జిన్నా గా ప్రేక్షకులను పలకరించనున్నారు. పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోయిన్స్ గా నటిస్తుండగా దర్శకుడు ఈశాన్ సూర్య తెరకెక్కిస్తున్నారు. జిన్నా చిత్రానికి ప్రముఖ రచయిత కోనా వెంకట్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. గతంలో మంచు విష్ణు హిట్ చిత్రాలు ఢీ, దేనికైనా రెడీ చిత్రాలకు కోనా వెంకట్ పని చేసిన విషయం తెలిసిందే.
కాగా నేడు జిన్నా ప్రీ లుక్ పోస్టర్ విడుదల చేశారు. జేబులో కళ్ళజోడు పెట్టుకున్న మంచు విష్ణు, ఆంజనేయ స్వామి లాకెట్ తో కనిపించారు. ఈ నేపథ్యంలో ప్రీ లుక్ మూవీపై ఆసక్తి రేపుతోంది. ఇక జులై 11న ఉదయం 10:22 నిమిషాలకు ఫస్ట్ లుక్(Ginna First Look) విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా జిన్నా తెరకెక్కుతుంది.
అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ జిన్నా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. అనూప్ రూపెన్స్ మ్యూజిక్ అందిస్తుండగా చోటాకె నాయుడు సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న జిన్నా చిత్రాన్ని త్వరలో విడుదల చేయనున్నారు. ఒక సాలిడ్ కమ్ బ్యాక్ కోసం ఎదురుచూస్తున్న మంచు విష్ణు కసితో జిన్నా మూవీ చేశారు.