
తమిళ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా‘పొన్నియన్ సెల్వన్ 1’ (PS 1) రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఈ పీరియాడ్ యాక్షన్ డ్రామాలో తమిళ స్టార్స్ చియాన్ విక్రమ్ (Vikram), కార్తీ హీరోలుగా నటిస్తున్నారు. హీరోయిన్లుగా బాలీవుడ్ అందాల సుందరి ఐశ్వర్యా రాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan), త్రిష క్రిష్ణన్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం రిలీజ్ కు సిద్ధం అవుతోంది. చిత్రీకరణ పూర్తి చేసుకోగా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చకాచకా కొనసాగుతున్నాయి. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మేకర్స్ ప్రారంభించారు.
తాజాగా ఈ మూవీ గురించి లేటెస్డ్ బజ్ క్రియేట్ అయ్యింది. భారీ అంచనాలతో విడుదలవుతున్న తమిళ చిత్రం ఆడియోను ఓ సంస్థ హ్యూజ్ ప్రైజ్ కు దక్కించుకుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (AR Rahman) మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. దీంతో మ్యూజిక్ పైనా గట్టి నమ్మకంతో ఉన్న మేకర్స్ భారీ ధరకు ఆడియోను విక్రయినట్టు సమాచారం. ప్రముఖ ఆడియో సంస్థ టిప్స్ మ్యూజిక్ ‘పీఎస్ 1’ ఆడియోను దక్కించుకునేందుకు ముందుకు వచ్చిందని, రూ. 24 కోట్లకు డీల్ కుదుర్చుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇంకా అఫిషియల్ అనౌన్స్ మెంట్ కూడా రావాల్సి ఉంది.
రీలీజ్ కు సిద్ధమవుతున్న ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలతో ఆడియెన్స్ ను బాగానే రీచ్ అవుతోంది. ఇప్పటికే చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. విక్రమ్, కార్తీ, ఐశ్వర్యా రాయ్, త్రిషలు ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. వారికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్స్ కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. 1995లో వచ్చిన కల్కి క్రిష్ణమూర్తి పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా మణి రత్నంతో పాటు ఎలాంగో కుమారవేల్, బి. జయమోహన్ సినిమా కథను రాశారు.
తమిళ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న చిత్రం ఇది. దాదాపు రూ.500 కోట్లతో Ponniyan Selvan 1ను మణిరత్నం అత్యద్భుతంగా చిత్రీకరించినట్టు టాక్ వినిపిస్తోంది. రిలీజ్ కు ముందే హిట్ టాక్ ను సొంతం చేసుకుంటున్న చిత్ర యూనిట్ సంతోషిస్తోంది. ప్రచార కార్యక్రమాలను భారీగా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. లైకా సంస్థ, మద్రాస్ టాకీస్ ప్రొడక్షన్ కంపెనీలు సంయుక్తంగా ఈ చిత్రానకి నిర్మాణ బాధ్యతలను వహించాయి. తమిళ స్టార్ జయం రవి, శోభితా ధూళిపాళ కూడా మరో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 30న వరల్డ్ వైడ్ రిలీజ్ చేసేందు మేకర్స్ షెడ్యూల్ చేశారు. తమిళంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, మలయాళం మరియు కన్నడలోనూ రిలీజ్ కానుంది.