#BheemlaNayak: ఫ్యాన్స్ ఇలా చేస్తారని అసలు ఊహించలేం,వైరల్ అయ్యింది

Surya Prakash   | Asianet News
Published : Feb 25, 2022, 06:08 AM IST
#BheemlaNayak: ఫ్యాన్స్ ఇలా చేస్తారని అసలు ఊహించలేం,వైరల్ అయ్యింది

సారాంశం

మా హీరో ఏ మాత్రం ప్రభుత్వానికి భయపడలేదని, అందుకే థియేటర్లకు వస్తున్నాడని అభిమానులు విశేషంగా ప్రచారం చేసుకున్నారు. అలాగే తమ హీరో సినిమా కొన్నవారికి నష్టాలు వాటిల్లకుండా ఉండేందుకు బెనిఫిట్ షోస్ కోసం డిమాండ్ చేయడం, విరాళాలు సేకరించడం వంటివి చేపట్టారు.


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరి 25న జనం ముందుకు వచ్చింది. ఈ సినిమా రిలీజ్ డేట్ ఇచ్చిన నాటి  నుంచీ అభిమానుల్లో సంబరం మొదలయింది. అలాగే ఈ సినిమా రిలీజ్ నాటికి ఏపీ గవర్నమెంట్ ప్రదర్శన ఆటలు, టిక్కెట్ రేట్ల విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటుందని భావించారు. కానీ, ఎప్పటిలాగే లిమెటెడ్ షోలు, మునుపటి రేట్లతోనే సాగాలని ప్రభుత్వం ఆదేశించడంతో నిర్మాత, అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు.

 పవన్ నటించిన ‘భీమ్లా నాయక్’ పలు రికార్డులు బద్దలు కొడుతుందని, నిర్మాతలకు, కొనుగోలుదారులకు లాభాలు చేకూరుస్తుందని అందరూ  భావించారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఇంకా టిక్కెట్ రేట్లపై, ప్రదర్శన ఆటలపై ప్రభుత్వం సూచించిన తీరే సాగుతూ ఉండడంతో  డిస్ట్రిబ్యూటర్స్ నిరాశ చెందారు. దాంతో ఈ సినిమాకు మునుపటిలా ‘బెనిఫిట్ షోస్’ కు అనుమతి ఇవ్వాలని చిత్తూరులో పవన్ ఫ్యాన్స్ ఆందోళనకు దిగారు. ఇదిలా ఉంటే, మాచర్లలో పవన్ అభిమానులు మరో అడుగు ముందుకేసి ఓ చోట గేటుకు ఓ డబ్బాను కట్టారు. దానిపై ‘భీమ్లా నాయక్’ పోస్టర్ పెట్టారు.

 అందులో పవన్ కళ్యాణ్ బొమ్మ పక్కనే “సినిమా డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోకుండా వారికి మాకు చేతనైన సహకారం కొరకు మాచర్ల పవన్ కళ్యాణ్ అభిమానుల తరపున విరాళాల సేకరణ” అంటూ అందులో పేర్కొన్నారు. ఇలా ‘భీమ్లా నాయక్’ కోసం ఏపీలో పవన్ కళ్యాణ్ అభిమానులు సినిమా కొనుక్కున్న వారికి తమకు చేతనైన సాయిం చేయాలని భావిస్తున్నారు.

మా హీరో ఏ మాత్రం ప్రభుత్వానికి భయపడలేదని, అందుకే థియేటర్లకు వస్తున్నాడని అభిమానులు విశేషంగా ప్రచారం చేసుకున్నారు. అలాగే తమ హీరో సినిమా కొన్నవారికి నష్టాలు వాటిల్లకుండా ఉండేందుకు బెనిఫిట్ షోస్ కోసం డిమాండ్ చేయడం, విరాళాలు సేకరించడం వంటివి చేపట్టారు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

భగవంతుడా ఒక్క ఫ్లాప్ ఇవ్వు అని వేడుకున్న చిరంజీవి డైరెక్టర్ ఎవరో తెలుసా? వరుసగా 16 సక్సెస్ లు తట్టుకోలేకపోయాడా?
Gunde Ninda Gudi Gantalu Today ఎపిసోడ్ డిసెంబర్ 16 బాలుని సవతి తల్లిలా చూశాను... ప్రభావతిలో మొదలైన పశ్ఛాత్తాపం