MAA elections మా కు పోటీగా ఆత్మా వస్తే జరిగే పరిణామాలు దారుణం... నష్టపోయేదివారే!

By team telugu  |  First Published Oct 15, 2021, 8:02 PM IST

MAA elections లో మంచు విష్ణు అధ్యక్షడిగా ఎన్నికయ్యారు. మెగా ఫ్యామిలీ బలపరిచిన ప్రకాష్ రాజ్ ఓడిపోయారు. అయినప్పటికీ ఇరు వర్గాల మధ్య గట్టి పోటీ నడిచింది. 


మా ఎన్నికలలో మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానెల్స్ పోటీపడిన విషయం తెలిసిందే. మంచు విష్ణుకు కృష్ణంరాజు, కృష్ణ, నందమూరి కుటుంబాలతో పాటు మోహన్ బాబుతో సన్నిహిత సంబంధాలు కలిగిన సీనియర్ నటులు సప్పోర్ట్ చేశారు. బహిరంగంగా చెప్పాలంటే పరిశ్రమలోని కమ్మ సామజిక వర్గానికి చెందిన నటులు బేషరతుగా మంచు విష్ణుకు మద్దతు ప్రకటించారు. అదే సమయంలో ఓట్లు కూడా వేయడం జరిగింది. 


ఇక Prakash raj ప్యానెల్ కి మెగా ఫ్యామిలీ పూర్తి మద్దతు ప్రకటించింది. మెగా ఫ్యామిలీ పట్ల అమిత విశ్వాసం ఉన్న వారు, ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులుగా పోటీ చేశారు. అలాగే చిరు, పవన్ పట్ల నమ్మకం, అమిత గౌరవం ఉన్నవారు.. నాన్ లోకల్ ఆరోపణలు, ప్రకాష్ రాజ్ మంచివాడు కాదన్న ప్రచారాన్ని పట్టించుకోకుండా ఓట్లు వేశారు. 

Latest Videos

undefined

Also read `పెద్దన్న`గా వస్తోన్న రజనీకాంత్‌.. `అన్నాత్తే` తెలుగు టైటిల్‌
MAA elections లో మంచు విష్ణు అధ్యక్షడిగా ఎన్నికయ్యారు. మెగా ఫ్యామిలీ బలపరిచిన ప్రకాష్ రాజ్ ఓడిపోయారు. అయినప్పటికీ ఇరు వర్గాల మధ్య గట్టి పోటీ నడిచింది. ప్రకాష్ రాజ్ ప్యానెల్ అధ్యక్ష పదవి కోల్పోయినప్పటికీ... ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ పదవులతో పాటు 8మంది ఈసీ సభ్యులను కైవసం చేసుకున్నారు. అధ్యక్ష పదవి కోల్పోయినా ఎన్నికలు ఏకపక్షంగా జరగలేదని ఈ ఫలితాలు చూస్తే అర్థం అవుతుంది . 


కాగా ప్రకాష్ ప్యానెల్ మాత్రం ఫలితాలను అంగీకరించడం లేదు. అడ్డదారుల్లో Manchu vishnu ప్యానెల్ గెలిచినట్లు ఆరోపిస్తున్నారు. దీనికి నిరసనగా.. తమ ప్యానెల్ తరఫున గెలిచిన మెంబర్స్ చేత రాజీనామా చేయించారు. కాగా మంచు విష్ణు అధ్యక్షుడిగా ఉన్న మా కు వ్యతిరేకంగా (ATMAA) స్థాపించబోతున్నట్లు సమాచారం అందుతుంది. మెగా ఫ్యామిలీ ఓటమిగా ప్రచారం అవుతున్న ఈ వైఫల్యాన్ని తట్టుకోలేక.. ఆత్మా ఏర్పాటు అయితే దారుణమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కాలేదు. 
ఆత్మా ఏర్పాటుతో అధికారికంగా చిత్ర పరిశ్రమ రెండుగా చీలిపోయినట్లే. 

Also read పవన్‌ కళ్యాణ్‌తో మంచు మనోజ్‌ భేటీ.. ఆసక్తిరేకెత్తిస్తున్న కొత్త పరిణామాలు.. రాజీ ప్రయత్నమా?

దీని వలన ప్రకాష్ రాజ్ మద్దతు దారులకు మంచు విష్ణు మద్దతుదారుల సినిమాలలో వేషాలు ఉండకపోవచ్చు. అదే సమయంలో మెగా హీరోల సినిమాలలో మంచు విష్ణుకు మద్దతు తెలిపిన నటులకు అవకాశాలు దక్కకపోవచ్చు. స్టార్స్ కి దీని వలన వచ్చిన నష్టం ఏమీ ఉండదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్స్, చిన్నా చితకా నటులు నష్టపోవడం ఖాయం. ఒత్తిడి లోనై ఓ పక్షం నిలిచిన కొందరు నటులకు ఈ పరిస్థితులు ప్రాణసంకటం అని చెప్పాలి.  

click me!