Unstoppable బాలయ్యతో టాక్ షో.. అల్లు అరవింద్ వ్యూహం ఇదేనా!

Published : Oct 15, 2021, 06:23 PM IST
Unstoppable బాలయ్యతో టాక్ షో.. అల్లు అరవింద్ వ్యూహం ఇదేనా!

సారాంశం

 ఆహా యాప్ మెగా ఫ్యామిలీది కావడంతో చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్స్ బాలయ్య టాక్ షోలో పాల్గొనే అవకాశం కలదు. అయితే బాలయ్య అంటే మెగా ఫ్యామిలీకి అసలు నచ్చదు

బద్ద శత్రువులు ఒకటయ్యారు. మెగా కాంపౌండ్ లోకి బాలయ్య ఎంటర్ అయ్యాడు.  మెగా, నందమూరి అభిమానులకు ఒకింత ఆశ్చర్యంగా ఉన్నా... ఇది నిజం. మెగా నిర్మాత, చిరంజీవి సొంత బావమరిది స్థాపించిన తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహా కోసం బాలయ్య వస్తున్నాడు. ఆహా యాప్ లో బాలయ్య టాక్ షో ప్రసారం కానుంది. టాలీవుడ్ కి చెందిన ప్రముఖులను బాలయ్య ఇంటర్వ్యూ చేయనున్నారు. 


ఇక ఆహా యాప్ మెగా ఫ్యామిలీది కావడంతో చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్స్ బాలయ్య టాక్ షోలో పాల్గొనే అవకాశం కలదు. అయితే బాలయ్య అంటే మెగా ఫ్యామిలీకి అసలు నచ్చదు. వివిధ సందర్భాలలో చిరంజీవిని టార్గెట్ చేస్తూ బాలయ్య కొన్ని నెగిటివ్ వ్యాఖలు చేశారు. సీఎం గా గెలిచిన ఎన్టీఆర్ వారసుల మైన మాది సపరేట్ బ్రీడ్ అంటారు బాలయ్య. అదే సమయంలో మా చరిత్రకు తిరుగులేదని, ఎవరూ సాటిరారని అంటారని బాలయ్య అన్న సందర్భాలు అనేకం. 


బాలయ్య వ్యాఖ్యలకు మెగా ఫ్యామిలీ స్పందించిన సందర్భాలు చాలా తక్కువ. అయితే మెగా బ్రదర్స్ లో ఒకరైన నాగబాబు మాత్రం బాలయ్యను చీల్చి చెండారారు. 2019 ఎన్నికలకు ముందు బాలకృష్ణకు వ్యతిరేకంగా ఓ సిరీస్ ఆఫ్ వీడియోలు నాగబాబు చేశారు. అలాగే కరోనా క్రైసిస్ సమయంలో తెలంగాణా మంత్రులతో భేటీ అయిన చిరంజీవిపై బాలయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. 


మా ఎన్నికల తరువాత మెగా, నందమూరి ఫ్యామిలీ మధ్య అంతరం మరింత పెరిగింది. ప్రకాష్ రాజ్ కి మెగా బ్రదర్స్ సప్పోర్ట్ చేయగా, మంచు విష్ణుకు సప్పోర్ట్ చేసిన పెద్ద కుటుంబాల్లో నందమూరి ఫ్యామిలీ కూడా ఒకటి ఉంది. 


మెగా, నందమూరి ఫ్యామిలీల మధ్య ఇంత అగాధం నెలకొని ఉన్నా, చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ బాలయ్యతో టాక్ షో ఎలా చేయగలిగారు అనేది ఆసక్తికరం. దీని వెనుక కొని వ్యూహాలు ఉన్నాయని తెలుస్తుంది. వివాదాలకు బిజినెస్ కి ముడిపెట్టకూడదు. అత్యంత పోటీ ఉన్న ఓటిటి రంగంలోకి అల్లు అరవింద్ ప్రవేశించారు. ఆహా యాప్ కోసం కోట్ల పెట్టుబడి పెట్టారు. కాబట్టి దాని సక్సెస్ కోసం అందుబాటులో ఉన్న వనరులు అన్ని ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాడు. 


ఆహా మెగా ఫ్యామిలీకి చెందిన యాప్ అని అందరికి తెలిసిన విషయమే అందుకే.. ప్రత్యర్థి ఫ్యామిలీ హీరో బాలయ్యను రంగంలోకి దించారు. పరిశ్రమలో రైవల్ కుటుంబాలుగా పేరున్న నందమూరి, కొణిదెల హీరోల మధ్య ఇంటర్వ్యూ అంటే జనాల్లో విపరీతమైన ఆసక్తి నెలకొని ఉంటుంది. కావున వివాదాల ఎన్ని ఉన్నా, బాలయ్యతో ఇలా టాక్ షో అల్లు అరవింద్ ఏర్పాటు చేశారు అంటున్నారు.

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: హస్పిటల్లో దీప- దశరథను రెచ్చగొట్టిన జ్యో- నిజం చెప్పేశాడా?
Mansion House Mallesh Movie Review: మెన్షన్‌ హౌజ్‌ మల్లేష్‌ మూవీ రివ్యూ.. అడల్ట్ కామెడీతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందంటే?