ఆత్మ.. పరమాత్మ.. ప్రేతాత్మ, అలాంటివేం లేవు : కొత్త అసోసియేషన్ ఏర్పాటుపై ప్రకాశ్ రాజ్ క్లారిటీ

Siva Kodati |  
Published : Oct 12, 2021, 07:32 PM ISTUpdated : Oct 12, 2021, 07:39 PM IST
ఆత్మ.. పరమాత్మ.. ప్రేతాత్మ, అలాంటివేం లేవు : కొత్త అసోసియేషన్ ఏర్పాటుపై ప్రకాశ్ రాజ్ క్లారిటీ

సారాంశం

మా అసోసియేషన్ (Maa Elections) రెండుగా చీలిపోతుందని.. ఆత్మ (atmaa) పేరుతో కొత్త అసోసియేషన్ పెట్టబోతున్నారంటూ మీడియాలో వస్తున్న కథనాలపై ప్రకాశ్ రాజ్ (prakash raj) స్పందించారు

మా అసోసియేషన్ (Maa Elections) రెండుగా చీలిపోతుందని.. ఆత్మ (atmaa) పేరుతో కొత్త అసోసియేషన్ పెట్టబోతున్నారంటూ మీడియాలో వస్తున్న కథనాలపై ప్రకాశ్ రాజ్ (prakash raj) స్పందించారు. మంగళవారం తన ప్యానెల్‌ నుంచి గెలిచిన 11మంది సభ్యులు రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త అసోసియేషన్‌ మొదలు పెట్టే ఆలోచన ఏదీ లేదని ప్రకాశ్‌రాజ్‌ తెలిపారు. ఈ క్రమంలోనే ‘ఆల్‌ తెలుగు మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (ఆత్మ) పేరుతో కొత్త అసోసియేషన్‌ ఏర్పాటు చేస్తారని వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు.   

‘‘ఆత్మ.. పరమాత్మ.. ప్రేతాత్మ అని ఏదో మొదలు పెడతామని వార్తలు వస్తున్నాయని.. కానీ తమకు అలాంటి ఆలోచన లేదని ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు.  కేవలం ‘మా’ అసోసియేషన్‌ సమస్యలపై స్పందించటానికే తాను వచ్చానని వెల్లడించారు.  అవసరమైతే ‘మా’లో ఉన్న వాళ్లతో కలిసి పనిచేస్తాం కానీ, మేమేదో 10 మందిని తీసుకుని కొత్త అసోసియేషన్‌ పెట్టే ఆలోచన లేదని ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు. రెండు వేర్వేరు ప్యానెల్స్‌లో గెలిచిన వాళ్లు పనిచేసే వాతావరణం లేదనే ఉద్దేశంతోనే మా ప్యానెల్‌ సభ్యులు రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. అది వాళ్ల నిర్ణయమేనని ప్రకాశ్ రాజ్ తెలిపారు. ఓడినా, గెలిచినా తాను ప్రశ్నిస్తూనే ఉంటానని.. ప్రతినెలా విష్ణు (manchu vishnu) ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ అడుగుతానని చెప్పారు. వాళ్లు చేసే పనిలో తాము అడ్డుపడబోమని.. కానీ, పనిచేయకపోతే తప్పకుండా ప్రశ్నిస్తాం’’ అని ప్రకాశ్‌రాజ్‌ వెల్లడించారు. 

ALso Read:విష్ణు.. నువ్వు ఫ్రీగా పనిచేసుకో.. నా 11 మంది రాజీనామా చేస్తున్నారు: ప్రకాశ్‌రాజ్ సంచలన నిర్ణయం

మా ఎన్నికల్లో చాలా రౌడీయిజం, మాటల పోరు, పోస్టల్ బ్యాలెట్స్‌లో అన్యాయం జరిగిందని ప్రకాశ్ రాజ్ ఆరోపించారు. అయినా ఎన్నికలు అపకూడదని ముందుకే వెళ్లామన్నారు. వేరే వూళ్ల నుంచి మనుషులను తెచ్చారని , డీఆర్‌సీ చీఫ్‌గా వున్న మోహన్ బాబు (mohanbabu) కౌంటింగ్‌కు వచ్చారని, కానీ క్రమశిక్షణ లేకుండా బెనర్జీపై (banerjee) చేయి చేసుకున్నారని, అసభ్యకరంగా మాట్లాడారని, నరేశ్ ప్రవర్తన బాలేదని ప్రకాశ్ రాజ్ మండిపడ్డారు. ఈసీ రిజల్ట్స్ పక్కనబెట్టారని.. తర్వాతి రోజు పోస్టల్ బ్యాలెట్లు కలపడం మరికొన్ని చర్యలతో లెక్కలు మారాయని ఆయన ఆరోపించారు. తన ప్యానెల్‌లో ఎనిమిది మందే గెలిచారని.. మిగిలిని మావి అన్నారని చెప్పారు. 

ఆదివారం గెలిచినవారు.. సోమవారం ఎలా ఓడిపోయారని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు. అందరినీ కలుపుకుని వెళ్తామన్న విష్ణు.. జనరల్ సెక్రటరీ, ట్రెజరీ మనవాడేనని.. ఎవడు అడ్డొచ్చినా మాదే మెజార్టీ అన్న ఆయన మాటలకు చాలా బాధేసిందని ప్రకాశ్ రాజ్ ఆవేదన  వ్యక్తం చేశారు. ఇలా మీరూ.. మేమూ అని అంటే కలిసి పనిచేయగలమా అని ఆయన ప్రశ్నించారు. తన రాజీనామాను ఆమోదించనని విష్ణు చెప్పారని.. కానీ మా నిబంధనల్లో తెలుగువాడు కానీ వాడు పోటీ చేసేందుకు వీలు లేదు అని మీరు మార్చకపోతే తన రాజీనామాను వాపస్ తీసుకుంటానని ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు.

PREV
click me!

Recommended Stories

ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి
IMDb రేటింగ్ ప్రకారం 2025 లో టాప్ 10 సినిమాలు, సౌత్ సినిమాల ముందు తలవంచిన బాలీవుడ్