పోస్టల్ బ్యాలెట్ దుర్వినియోగం అవుతుంది.. విష్ణు ప్యానెల్ పై ఎన్నికల అధికారికి ప్రకాష్ రాజ్ ఫిర్యాదు

By team telugu  |  First Published Oct 5, 2021, 11:15 AM IST

మంచు విష్ణు(Manchu vishnu) ప్యానెల్ ఎన్నిక నిబంధనలను ఉల్లంఘిస్తోందని, నిబంధనలు విరుద్ధంగా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ప్రకాష్(Prakash raj) అంటున్నారు. 


మంచు మనోజ్ ప్యానెల్ పై ప్రకాష్ రాజ్ ఎన్నికల అధికారికి పిర్యాదు చేశారు. మంచు మనోజ్, మోహన్ బాబు ఓట్ల కోసం అడ్డదారులు తొక్కుతున్నారని ప్రకాష్ రాజ్ సంచలన కామెంట్స్ చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తమకు అనుకూలంగా మలచుకున్నారని ప్రకాష్ రాజ్ ఆరోపిస్తున్నారు. శ్రీకాంత్, జీవితతో పాటు కార్యాలయానికి వచ్చిన ప్రకాష్ రాజ్ తన  ఫిర్యాదు ఎన్నికల అధికారికి సమర్పించారు. 

మోహన్ బాబు రూ. 28 వేలు ఒకేసారి కట్టారని,మహేష్ తండ్రి ఘట్టమనేని కృష్ణగారు, డిసిప్లినరీ కమిటీ మెంబర్ కృష్ణంరాజుగారు, పరుచూరి బ్రదర్స్, శారదగారు, ఇలా చాలా మంది నటుల సభ్యత ఫీజు మోహన్ బాబు చెల్లించారు. చెన్నైలో  ఉన్న శరత్ బాబు గారికి ఫోను చేసి మీ డబ్బులు మోహన్ బాబు మనుషులు చెల్లించారని అడిగితే, రూ. 500 నేను మోహన్ బాబు గారికి  గూగుల్ పే చేస్తాను అన్నారు. ఎన్నికలు జరిపే విధానం ఇదేనా. గెలవడం కోసం ఇలాంటి పనులు చేస్తారా అంటూ ప్రకాష్ రాజ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోహన్ బాబు వద్ద మేనేజర్ గా ఉన్న వ్యక్తి ఈ చర్యలకు పాల్పడుతున్నారని ప్రకాష్ రాజ్ తెలిపారు. 

Latest Videos

ఎన్నికలలో పారదర్శకత ఉండాలి పోస్టల్ బ్యాలెట్ దుర్వినియోగం అవుతోందని ప్రకాష్ రాజ్ గట్టిగా వాదిస్తున్నారు.దీనికి సంబంధించిన ఆధారాలతో తన పిర్యాదు అందజేశారు.ఇది అన్యాయం కాదా అని...  చిరంజీవి, మురళీమోహన్ వంటి పెద్దలను ఈ విషయంలో సూటిగా ప్రశ్నించారు ప్రకాష్ రాజ్.  60 ఏళ్లు బపైబడినవారు మాత్రమే పోస్టల్ బ్యాలెట్ కు అర్హులని ప్రకాష్ రాజ్ గుర్తు చేశారు. 

click me!