ప్రకాష్ రాజ్ కి చిరంజీవి మద్దతు ఉంది- నాగబాబు

By team teluguFirst Published Jun 25, 2021, 11:11 AM IST
Highlights

మా అధ్యక్ష ఎన్నికల పోటీలో దిగిన ప్రకాష్ రాజ్ తన మద్దతుదారులతో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఇక ప్రకాష్ రాజ్ ప్యానెల్ ని సప్పోర్ట్ చేస్తున్న నాగబాబు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొని తన అభిప్రాయాలు తెలియజేశారు.

మూవీ ఆర్టిస్ట్స్  అసోసియేషన్(MAA) ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పోటీలో ఉన్న ప్యానెల్స్ ప్రచార జోరు పెంచారు. తాము సప్పోర్ట్ చేస్తున్న ప్యానెల్ సభ్యులకు మద్దతుగా మాట్లాడడం జరిగింది. మా అధ్యక్ష ఎన్నికల పోటీలో దిగిన ప్రకాష్ రాజ్ తన మద్దతుదారులతో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఇక ప్రకాష్ రాజ్ ప్యానెల్ ని సప్పోర్ట్ చేస్తున్న నాగబాబు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొని తన అభిప్రాయాలు తెలియజేశారు. 

 
''రెండు నెలల క్రితమే ప్రకాష్ రాజ్ నన్ను కలిసి 'మా' (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) కి ఒక బిల్డింగ్ ఉండాలి. దాన్ని పారదర్శకంగా నడపడానికి తన వద్ద ఉన్న  ప్రణాళిక, కార్యాచరణ చెప్పారు. వివిధ భాషల్లో పని చేసిన ప్రకాష్ రాజ్ సమర్ధుడు. తెలంగాణలో మూడు గ్రామాలు దత్తత తీసుకోవడం జరిగింది.  ప్రకాష్ రాజ్ సామాజిక సేవా గుణం కలవాడు. మా అసోసియేషన్ అనేది ప్రతి ఒక్కరికి చేరువ చేయాలి అన్నారు''.

''ఇక లోకల్ నాన్ లోకల్ అనేది ఏమీ ఉండదు. మనమందరం ఇండియన్ నటులం, అమెరికాలో ఉన్నవారికి కూడా కొన్నాళ్ళకు అక్కడ పౌరసత్వం దక్కుతుంది. తెలంగాణా రాష్ట్రంలో మూడు గ్రామాలు దత్తత తీసుకొని సేవ చేస్తున్న ప్రకాష్ రాజ్ ఎక్కడ పుట్టారు అనేది అనవసరం. ఆయన తెలుగులో నటుడిగా స్థిరపడ్డారు. ఒక సమర్ధవంతమైన వ్యక్తిగా ప్రకాష్ రాజ్ కి నా మద్దతు ప్రకటిస్తున్నాను. అలాగే అన్నయ్య చిరంజీవి ఆశీస్సులు కూడా ఉన్నాయి''. 


''గత నాలుగేళ్లుగా 'మా' పనితీరు బాగోలేదు. దాని ప్రతిష్ట మసకబారింది. 'మా'కు గౌరవం తీసుకురావాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. అందుకే నేను ప్రకాష్ రాజ్ కి మద్దతుగా నిలుచున్నాను.. అంటూ నాగబాబు ప్రకాష్ రాజ్ కి పూర్తి సపోర్ట్ ప్రకటించారు''. 


 

click me!