అల్లరి నరేష్ నాంది హిందీలో.. చేతులు కలిపిన దిల్ రాజు-అజయ్ దేవ్ గణ్

Published : Jun 25, 2021, 09:05 AM IST
అల్లరి నరేష్ నాంది హిందీలో.. చేతులు కలిపిన దిల్ రాజు-అజయ్ దేవ్ గణ్

సారాంశం

అల్లరి నరేష్ లేటెస్ట్ హిట్ మూవీ నాంది చిత్ర హిందీ రీమేక్ పై అధికారిక ప్రకటన విడుదలైంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, అజయ్ దేవ్ గణ్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపారు.


తెలుగు సినిమాలపై హిందీ స్టార్స్ మనసు పారేసుకుంటున్నారు. ఇప్పటికే అనేక తెలుగు చిత్రాలు హిందీలో రీమేక్ కావడం జరిగింది. తాజాగా అల్లరి నరేష్ లేటెస్ట్ హిట్ మూవీ నాంది చిత్ర హిందీ రీమేక్ పై అధికారిక ప్రకటన విడుదలైంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, అజయ్ దేవ్ గణ్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపారు. 


యువ దర్శకుడు విజయ్ కనకమేడల న్యాయవ్యవస్థలో ఉన్న లోపాలు ప్రశ్నించేలా నాంది తెరకెక్కించారు. తమ ప్రయాజనాలు, ఒత్తిళ్ల నుండి బయటపడడం కోసం అమాయకుడైన ఓ వ్యక్తిని ఎలా బలి చేశారన్నది నాంది కథాంశం. చేయని తప్పుకు ఏళ్ల తరబడి శిక్ష అనుభవిస్తూ, న్యాయపోరాటం చేసే యువకుడిగా అల్లరి నరేష్ కనిపించారు. చాలా కాలం తరువాత నరేష్ కి హిట్ ఇచ్చిన చిత్రం నాంది నిలిచింది. 


ఈ క్రైమ్ డ్రామాను అజయ్ దేవ్ గణ్ హీరోగా దిల్ రాజు హిందీలో రీమేక్ చేస్తున్నారు. దీనిపై నేడు అధికారిక ప్రకటన రావడం జరిగింది. అజయ్ దేవ్ గణ్ ఫిలిమ్స్ సంయుక్తంగా ఈ మూవీ నిర్మాణంలో పాల్గొంటున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటికే దిల్ రాజు నాని జెర్సీ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది.  

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు