నాకు నచ్చిన ప్యానల్ కి మద్దతిచ్చిన వారికే వేషాలు... ఓపెన్ బ్లాక్ మెయిల్.. సంచలనంగా అజయ్ భూపతి ట్వీట్

By team telugu  |  First Published Oct 7, 2021, 2:06 PM IST

మధ్యలో వచ్చి బాంబు పేల్చాడు ఆర్ ఎక్స్ 100 ఫేమ్ దర్శకుడు అజయ్ భూపతి. మా ఎన్నికలను ఉద్దేశిస్తూ ఆయన చేసిన రెండు ట్వీట్స్ సంచలనంగా మారాయి. కొత్త అనుమానాలకు తెరలేపాయి. 
 


మా ఎన్నికల నేపథ్యంలో నటుల మధ్య జరగాల్సిన రచ్చ జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా టాలీవుడ్ పరువు బజారున పడింది. మొదట్లో సంస్థాగతంగా విమర్శించుకున్న నటులు, ప్రస్తుతం వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. ఒకవైపు నుండి Prakash raj, హేమ, జీవితా రాజశేఖర్, నాగబాబు... మరొకవైపు నుండి నరేష్, మంచు విష్ణు, బాబు మోహన్ పరస్పరం మాటల దాడి చేసుకున్నారు. 


బూతులు మాత్రమే తిట్టుకోలేదు కానీ, ఆ స్థాయి పదాలు, వార్నింగ్ లు నడుస్తున్నారు. మరో మూడు రోజులలో ఎన్నికలు కాగా, ప్రెస్ మీట్స్ కి తెరదించి ప్రచారంలో నిమగ్నమయ్యారు ఇరు వర్గాలు. ఇదిలా ఉంటే, మధ్యలో వచ్చి బాంబు పేల్చాడు ఆర్ ఎక్స్ 100 ఫేమ్ దర్శకుడు అజయ్ భూపతి. MAA elections ను ఉద్దేశిస్తూ ఆయన చేసిన రెండు ట్వీట్స్ సంచలనంగా మారాయి. కొత్త అనుమానాలకు తెరలేపాయి. 

Latest Videos

''ఈ థ్రిల్లర్ ఎపిసోడ్లు చూస్తుంటే నాక్కూడా రెండు మూడు సినిమాల్లో నటించి 'మా' లో కార్డు తీసుకుని ఎన్నికల్లో ప్రెసిడెంటుగా పోటీ చేయాలనుంది.ఏదేమైనా, ఈ ఎన్నికల తరువాత 14th న మన "మహాసముద్రం" రిలీజ్ ఉంది.. అందరూ తప్పకుండా థియేటర్లలోనే చూడండి!!'' అంటూ ఓ ట్వీట్ చేశారు. అనంతరం మరో ట్వీట్ లో ''నాకు నచ్చిన ప్యానల్ కి మద్దతిచ్చిన వారికే క్యారెక్టర్లు రాస్తా...(అని నాతో ఇప్పుడే ఒక డైరెక్టర్ అన్నాడు)'' అని కామెంట్ చేశారు. 

నాకు నచ్చిన ప్యానల్ కి మద్దతిచ్చిన వారికే క్యారెక్టర్లు రాస్తా...

(అని నాతో ఇప్పుడే ఒక డైరెక్టర్ అన్నాడు)

— Ajay Bhupathi (@DirAjayBhupathi)


మా ఎన్నికల హీట్ నడుస్తున్న నేపథ్యంలో ఈ సందర్భాన్ని తన సినిమా ప్రమోషన్ కోసం వాడుకున్నట్లు మొదటి ట్వీట్ అనిపించింది. కానీ రెండవ ట్వీట్ చాలా వివాదాస్పదంగా, మా ఎన్నికల నిర్వహణను తప్పుబట్టేదిగా ఉంది. పరోక్షంగా కొందరు దర్శకులు మా సభ్యులను ఓట్ల కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నారని Ajay bhupathi ఆ ట్వీట్ ద్వారా చెప్పారు. తాను కోరుకుంటున్న ప్యానెల్ కి ఓటు వేసిన వారికే, తన సినిమాలలో వేషాలు ఉంటాయని ఆ డైరెక్టర్ బెదిరింపులకు దిగుతున్నట్లు అర్థం అవుతుంది. 

ఈ థ్రిల్లర్ ఎపిసోడ్లు చూస్తుంటే నాక్కూడా రెండు మూడు సినిమాల్లో నటించి 'మా' లో కార్డు తీసుకుని ఎన్నికల్లో ప్రెసిడెంటుగా పోటీ చేయాలనుంది.

ఏదేమైనా, ఈ ఎన్నికల తరువాత 14th న మన "మహాసముద్రం" రిలీజ్ ఉంది.. అందరూ తప్పకుండా థియేటర్లలోనే చూడండి!! pic.twitter.com/yJD3GWIZwR

— Ajay Bhupathi (@DirAjayBhupathi)


ఓట్ల కోసం ప్యానెల్ సభ్యులు పలు ప్రలోభాలకు పాల్పడుతున్నారని ఇప్పటికే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు నుండి ఇలాంటి బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారని అజయ్ భూపతి ట్వీట్ తెలియజేస్తుంది. అయితే అజయ్ భూపతితో అలాంటి కామెంట్ చేసిన సదరు డైరెక్టర్ ఎవరి వర్గం అనేది స్పష్టత లేదు. 

నెటిజెన్స్ మాత్రం కామెంట్స్ రూపంలో అజయ్ భూపతిని ఏకిపారేస్తున్నారు. అజయ్ భూపతి ఆ డైరెక్టర్ పేరు చెబితేనే మహా సముద్రం సినిమా చూస్తామని ఒకరు కామెంట్ చేస్తే, మరొకరు సినిమా విడుదల పెట్టుకొని నీకు ఇలాంటి వివాదాస్పద ట్వీట్స్ అవసరమా అంటున్నారు. అలాగే ప్రకాష్ రాజ్, Manchu Vishnuలకు అనుకూలంగా కొందరు, వ్యతిరేకంగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. 

Also read తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కి తెలుగువాడే అధ్యక్షుడు కావాలి... నటుడు రవిబాబు కీలక వ్యాఖ్యలు

click me!