ఆ స్టార్ హీరోల భార్యలు డ్రగ్స్ తీసుకుంటారు.. స్వయంగా చూసి షాకయ్యా

By Surya Prakash  |  First Published Oct 7, 2021, 1:42 PM IST

తాను డ్యాన్స్ చేసిన తర్వాత అక్కడ కొన్ని షాకింగ్ దృశ్యాలను చూశానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. తాజాగా ఆ ఇంటర్వ్యూ క్లిప్‏ను షేర్ చేసింది షెర్లిన్. అందులో షెర్లిన్ మాట్లాడుతూ.. డ్యాన్స్ చేసి అలసిపోయిన తర్వాత నేను వాష్ రూంకు వెళ్లాను. 
 


బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మరణం తర్వాత  డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చింది. దాంతో ఎన్సీబీ పూర్తిస్థాయిలో దృష్టిపెట్టింది.అప్పటికే చాలా సార్లు అనుకున్న విషయమే అయినా మరోసారి సినీ పరిశ్రమలో మాదక ద్రవ్యాలు ఎంతగా వేళ్లూనుకుపోయాయో బట్టబయలైనట్లైంది. ఒక్క బాలీవుడ్ లోనే కాదు ఇటు తెలుగు, అటు కన్నడ లోనూ ఈ కేసు ప్రకంపనాలు సృష్టించింది. ఇక రెండు రోజుల క్రితం బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్టు చేసింది. రేవ్ పార్టీలో అతను దొరికిపోవటమే అందుకు కారణం. ఓ క్రూయిజ్ షిప్ లో ఈ రేవ్ పార్టీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో బాలీవుడ్ నుంచి రకరకాల కామెంట్స్ వినపడుతున్నాయి. హాట్ బాంబ్ షెర్లీన్ చోప్రా సైతం తనదైన శైలిలో కామెంట్ చేసింది.

బాలీవుడ్ హాట్ బ్యూటీ షెర్లిన్ చోప్రా షేర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్  మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. బాలీవుడ్ సినీ పరిశ్రమలో డ్రగ్స్ విచ్చలవిడిగా వాడతారని షాకింగ్ కామెంట్స్ చేసింది. షారుఖ్ ఖాన్‍కు సొంతంగా కోల్ కత్తా నైట్ రైడర్స్ పేరుతో సొంతంగా ఐపీఎల్ జట్టు ఉందన్న సంగతి తెలిసిందే. అయితే గతంలో ఓ మ్యాచ్‏లో షెర్లిన్ డ్యాన్స్ చేసింది. తాను డ్యాన్స్ చేసిన తర్వాత అక్కడ కొన్ని షాకింగ్ దృశ్యాలను చూశానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. తాజాగా ఆ ఇంటర్వ్యూ క్లిప్‏ను షేర్ చేసింది షెర్లిన్. అందులో షెర్లిన్ మాట్లాడుతూ.. డ్యాన్స్ చేసి అలసిపోయిన తర్వాత నేను వాష్ రూంకు వెళ్లాను. 

Latest Videos

Also read ఆర్యన్‌ఖాన్‌కి కోర్టు షాక్: బెయిల్ తిరస్కరణ, ఈ నెల 7వ తేదీ వరకు కస్టడీ

అక్కడ డోర్ ఓపెన్ చేయగానే.. కనిపించిన దృశ్యాలను చూసి షాకయ్యాను. నేను తప్పు ప్లేస్‏కు వచ్చానా ? అనిపించి.. ఒక్క క్షణం నా మైండ్ పనిచేయలేదు. ఆ తర్వాత విషయం అర్థమైంది. అక్కడున్న స్టార్ల భార్యలు.. వాష్ రూం అద్దాల ముందు నిల్చుని తెల్లని పౌడర్ పీలుస్తున్నారు. వారు డ్రగ్స్ తీసుకుంటున్నారని నాకు అర్థమైంది. ఒక్కొక్కరూ సైకోలా ప్రవర్తిస్తున్నారు. వారిని చూసి ఓ నవ్వు నవ్వి అక్కడి నుంచి బయటకు వచ్చాను. ఆ తర్వాత షారుఖ్ ఖాన్‏కు.. అతని స్నేహితులకు గుడ్ బై చెప్పి అక్కడి నుంచి వచ్చేసాను. బాలీవుడ్ ఇండస్ట్రీలో జరిగే పార్టీలో ఎలాంటివో నాకు ఆరోజే అర్థమైంది అంటూ చెప్పుకొచ్చింది షెర్లిన్. 

Also read షారుఖ్ తనయుడు అరెస్ట్.. ప్రకంపనలు సృష్టిస్తున్న రేవ్ పార్టీ, రూ.5 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
 

click me!