
ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుండి జనరల్ సెక్రెటరీగా పోటీ చేసిన జీవిత ఓటమిపాలయ్యారు. మంచు విష్ణు ప్యానెల్ నుండి అదే పదవికి పోటీ పడ్డ రఘుబాబు విజయం సాధించారు. మా కమిటీ మెంబర్స్ లో ప్రధానమైన జనరల్ సెక్రెటరీ, ట్రెజరర్ పదవులు ప్రకాష్ రాజ్ ప్యానెల్ కోల్పోయింది. ట్రెజరర్ గా శివబాలాజీ గెలుపొందారు. ప్రస్తుత మా జనరల్ సెక్రెటరీగా జీవిత ఉండగా.. ఆమె ఆ పదవి కోల్పోయారు.
ట్రెజరర్ గా పోటీ చేసిన శివబాలాజీ గెలుపొందారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుండి పోటీ పడిన నాగినీడుపై శివబాలాజీ గెలుపొందడం జరిగింది. కీలకమైన మా కార్యనిర్వాహక వర్గంలో ట్రెజరర్ ఒకటి కాగా, బాలాజీ ఆ పదవిని కైవసం చేసుకున్నారు.
నరేష్ అధ్యక్షుడిగా ఉన్న గత మా ఎగ్జిక్యూటివ్ కమిటీలో శివబాలాజీ ట్రెజరర్ గా ఉన్నారు. మరోమారు వరుసగా ఆయన ఈ పదవిని చేపట్టారు. దీనితో మరో రెండేళ్లు మా లో శివబాలాజీ ట్రెజరర్ గా ఉండనున్నారు.
మరోవైపు ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా పోటీ చేసిన శివా రెడ్డి, కౌశిక్ రెడ్డి, సురేష్ కొండేటి,అనసూయ విజయం సాధించించారు. మిగిలిన 15 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఫలితాలు రావాల్సి ఉంది. మంచు విష్ణు ప్యానెల్ నుండి కూడా అధిక సభ్యులు గెలిచే సూచనలు కలవు.