ఇండియాలో పుట్టిన ప్రతివాడు లోకలే...నాన్ లోకల్ వాదనపై  సుమన్ సెన్సేషనల్ కామెంట్స్!

By team teluguFirst Published Jul 3, 2021, 8:44 AM IST
Highlights

 నాన్ లోకల్ ఫీలింగ్ పై నటుడు సుమన్ స్పందించారు. అసలు నాన్ లోకల్ అనే ఫీలింగ్ మంచిది కాదని ఆయన వాదించారు. ఇండియాలో పుట్టిన ప్రతివాడు లోకల్ అవుతాడు, కేవలం విదేశీయులు మాత్రమే నాన్ లోకల్ అని ఆయన గట్టిగా చెప్పారు. 

త్వరలో జరగనున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో లోకల్, నాన్ లోకల్ అనే ఓ వాదన తెరపైకి వచ్చింది. స్వతహా కన్నడిగుడు అయిన ప్రకాష్ రాజ్ మా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించడంతో 'మా' సభ్యులుగా ఉన్న కొందరు, తెలుగువాడు కాని ప్రకాష్ రాజ్ ఎలా పోటీ చేస్తారంటూ, విమర్శించడం జరిగింది.  


కాగా ఈ లోకల్, నాన్ లోకల్ ఫీలింగ్ పై నటుడు సుమన్ స్పందించారు. అసలు నాన్ లోకల్ అనే ఫీలింగ్ మంచిది కాదని ఆయన వాదించారు. ఇండియాలో పుట్టిన ప్రతివాడు లోకల్ అవుతాడు, కేవలం విదేశీయులు మాత్రమే నాన్ లోకల్ అని ఆయన గట్టిగా చెప్పారు. మనకు వైద్యం చేసే డాక్టర్, ఐ ఏ ఎస్, ఐ పి ఎస్ అధికారులు కూడా నాన్ లోకల్స్ కావచ్చు. అలా అని వాళ్ళ సేవలను మనం తిరస్కరించం కదా, అని ప్రశ్నించారు. 


ముఖ్యంగా నటుల విషయంలో ఈ నాన్ లోకల్ వాదన రాకూడదు అన్నారు. ఒక నటుడు, లేదా టెక్నిషియన్ ఏ భాషలో అయినా సక్సెస్ కావచ్చు. తమ టాలెంట్ నిరూపించుకోవడానికి వివిధ పరిశ్రమలకు వెళ్లడం జరుగుతుంది. ఎవరికైనా డబ్బులు కావాలి, పేరు కావాలి... దాని కోసం అవకాశం ఉన్న పరిశ్రమలలో పనిచేస్తారు. కాబట్టి భాష, పుట్టిన ప్రదేశం ఆధారంగా నాన్ లోకల్ అనడం సరికాదని సుమన్ అన్నారు. 


ఈ నాన్ లోకల్ ఫీలింగ్ ఇతర రాష్ట్రాలలో ఉన్న విద్యార్థులు, వ్యాపారుల ప్రయోజనాలు దెబ్బతీసే అవకాశం కలదు. అక్కడ లోకల్స్ మిగతా వారిని శత్రువులుగా చూసే అవకాశం ఉంది. కాబట్టి ఈ నాన్ లోకల్ వాదన తీసుకురాకుండా ఉండాలి అన్నారు. ప్రస్తుత గడ్డు పరిస్థితులలో నటులు, సాంకేతిక నిపుణులు అవకాశాల కోసం ఇతర పరిశ్రమల బాటపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్నారు. 


సుమన్ వ్యాఖ్యలు నటుడు ప్రకాష్ రాజ్ కి మద్దతుగా నిలిచాయి. కాగా 1980లలో స్టార్ హీరోగా సుమన్ టాలీవుడ్ ని ఏలారు. తెలుగు, తమిళ్ పరిశ్రమలో హీరోగా సినిమాలు చేసిన సుమన్ కర్ణాటక ప్రాంతానికి చెందినవాడు కావడం విశేషం.
 

click me!