ఆ వర్షన్ చూసిన సుకుమార్ సూపర్ హ్యాపీ... బన్నీ కేక పుట్టించాడట!

By team teluguFirst Published Jul 3, 2021, 7:34 AM IST
Highlights

పుష్ప మొదటి పార్ట్ షూటింగ్ దాదాపు కంప్లీట్ అయ్యింది. కొన్ని సన్నివేశాలు మినహాయించి ఫస్ట్ పార్ట్ షూటింగ్ పార్ట్ పూర్తి అయినట్లే. కాగా పుష్ప పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేశారట దర్శకుడు సుకుమార్. 
 

అల్లు అర్జున్, సుకుమార్ ల హ్యాట్రిక్ ప్రాజెక్ట్ పుష్ప. పాన్ ఇండియా మూవీగా రెండు భాగాలుగా విడుదల కానుంది. పుష్ప మూవీ కథ పరిధి రీత్యా రెండు భాగాలుగా చెప్పడం మంచిదని భావించిన సుకుమార్, ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక పుష్ప మొదటి పార్ట్ షూటింగ్ దాదాపు కంప్లీట్ అయ్యింది. కొన్ని సన్నివేశాలు మినహాయించి ఫస్ట్ పార్ట్ షూటింగ్ పార్ట్ పూర్తి అయినట్లే. కాగా పుష్ప పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేశారట దర్శకుడు సుకుమార్. 


కాగా పుష్ప ఎడిటెడ్ వర్షన్ చూసిన సుకుమార్ ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తుంది. పుష్ప అవుట్ ఫుట్ పై సుకుమార్ చాలా సంతృప్తిగా ఉన్నారట. పుష్ప భారీ విజయం సాధిస్తుందనే నమ్మకం ఆయన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక ఊరమాస్ అవతార్ లో పుష్పరాజ్ గా అల్లు అర్జున్ ప్రేక్షకులకు, ఫ్యాన్స్ కి కొత్త అనుభూతిని పంచనున్నట్లు తెలుస్తుంది. 


శేషాచలం అడవుల్లో సాగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పుష్ప మూవీ తెరకెక్కింది. అల్లు అర్జున్ రాయలసీమ ప్రాంతానికి చెందిన రెడ్ శాండిల్ స్మగ్లర్ గా కనిపించనున్నారు. విడుదలైన పుష్ప టీజర్ రికార్డు రెస్పాన్స్ దక్కించుకుంది. ఇక పుష్ప షూటింగ్ కి సెకండ్ వేవ్ బ్రేక్ వేయగా త్వరలో తిరిగి ప్రారంభం కానుంది. 


సాధారణ పరిస్థితులు ఏర్పడిన వెంటనే పుష్ప థియేటర్స్ లో దిగే అవకాశం కలదు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మిక మందాన నటిస్తున్నారు. కాగా మలయాళ టాలెంటెడ్ నటుడు ఫాజిల్ ఫహద్ విలన్ రోల్ చేయడం విశేషం. పుష్ప చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందిస్తుండగా యాంకర్ అనసూయ ఓ కీలక రోల్ చేస్తున్నారు. 

click me!