MAA elections: ఓటు హక్కు వినియోగించుకున్న చిరు-చరణ్!

Published : Oct 10, 2021, 10:40 AM ISTUpdated : Oct 10, 2021, 10:42 AM IST
MAA elections: ఓటు హక్కు వినియోగించుకున్న చిరు-చరణ్!

సారాంశం

 మెగా ఫ్యామిలీ నుండి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. Ram charan మంచు విష్ణును ఆలింగనం చేసుకున్నారు. పక్కనే ఉన్న మోహన్ బాబుతో చరణ్ మాట్లాడారు.

MAA elections వేళ తారలందరూ ఒక చోట చేరారు. టాలీవుడ్ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అందరికంటే ప్రధమంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోలింగ్ కేంద్రానికి వచ్చి, ఓటు వేయడం జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన Pawan kalyan, చిత్ర పరిశ్రమలో ఎటువంటి చీలికలు లేవని, వ్యక్తుల మధ్య దూషణలు పరిశ్రమకు ఆపాదించకూడదు అన్నారు. ఇక చిరంజీవి, మోహన్ బాబు మంచి మిత్రులని, వాళ్ళ మధ్య ఎటువంటి విభేదాలు లేవన్నారు. 

అనంతరం మెగా ఫ్యామిలీ నుండి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. Ram charan మంచు విష్ణును ఆలింగనం చేసుకున్నారు. పక్కనే ఉన్న మోహన్ బాబుతో చరణ్ మాట్లాడారు. ఓటు వేసిన అనంతరం అక్కడి నుండి నిష్క్రమించారు. ఇక Chiranjeevi సైతం తన ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. 

Also read MAA Elections: ఓటు హక్కు వినియోగించుకున్న పవన్, నిత్యామీనన్, రాంచరణ్.. పోలింగ్ కేంద్రం వద్ద తారలు


 వివాదాలపై ఆయన స్పందించారు... ఎవరేమి మాట్లాడినా పరిస్థితుల వలన ఏర్పడిన చిన్న చిన్న వివాదాలు అన్నారు. అవన్నీ పరిష్కరించి, మా అభివృద్ధి కోసం కలిసి కృషి చేస్తాం అన్నారు. ఇక వివాదాల గురించి మరో రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు.. మీకు మంచి మెటీరియల్ దొరికింది కదా అంటూ.. సెటైర్ వేశారు చిరంజీవి. 


ఇక మా అధ్యక్ష పదవి కోసం ప్రకాష్ రాజ్, మంచు విష్ణు పోటీపడుతున్న విషయం తెల్సిందే. ఎప్పుడూ లేనంతగా ఈ సారి మా ఎన్నికలు వివాదాస్పదం అయ్యాయి. ప్రకాష్ రాజ్, నాగబాబు ఒకవైపు నరేష్ మంచు విష్ణు మరోవైపు ఉండి, మాటల దాడి చేసుకున్నారు. కోటా శ్రీనివాసరావు వంటి సీనియర్ నటుడిని నాగబాబు వాడో జంతువు అనడం.. ఈ ఎన్నికలు ఏ స్థాయిలో టాలీవుడ్ పరువు తీశారో అర్థం చేసుకోవచ్చు.

PREV
click me!

Recommended Stories

నా కూతురు చిన్న పిల్ల... మీరు రాసే వార్తలు చదివితే తట్టుకోగలదా? స్టార్ హీరో ఎమోషనల్
Balakrishna Favourite : బాలయ్య కు బాగా ఇష్టమైన హీరో, హీరోయిన్లు ఎవరో తెలుసా? ఆ ఇద్దరే ఎందుకు ?