MAA elections: విక్టరీ తరువాత మోహన్ బాబు ఏం మాట్లాడారంటే!

By team teluguFirst Published Oct 10, 2021, 11:52 PM IST
Highlights

క్రమంగా మా ఎన్నికలు తీవ్రరూపం దాల్చాలి.  ఇరు అభ్యర్థులు వ్యక్తిగత విమర్శలు చేసుకున్నారు . రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేదికగా.. పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. 

ఓ యుద్ధంలా జరిగిన మా ఎన్నికలలో మంచు విష్ణు విజేతగా నిలిచారు. దాదాపు రెండు నెలలుగా మా సభ్యుల మధ్య కొట్లాట జరుగుతుంది. మొదటిగా ప్రకాష్ రాజ్ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్నట్లు ప్రకటించడంతో పాటు 27మంది సభ్యులతో ప్యానెల్ విడుదల చేశారు.అదే సమయంలో ప్రస్తుతం మా అధ్యక్షుడిగా ఉన్న నరేష్ పై కొన్ని నెగిటివ్ కామెంట్స్ చేశారు. 


ప్రకాష్ రాజ్ తన వద్ద బెటర్ ఐడియాలజీ ఉందని, ప్రస్తుతం ఎన్నిక కాబడిన మా ప్యానెల్ పనితీరు బాగా లేదని అన్నారు.ప్రకాష్ రాజ్ కి మద్దతుగా నిలిచిన నాగబాబు అయితే గత రెండేళ్లలో మా ప్రతిష్ట మసకబారింది అన్నారు. నాగబాబు, ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలకు నరేష్ ప్రెస్ మీట్ ద్వారా వివరణ ఇచ్చారు. అదే సమయంలో రెండేళ్లలో మా సభ్యులకు చేసిన సేవలకు సంబంధించిన రికార్డ్స్ ప్రెస్ ముందు ప్రస్తావించారు.

క్రమంగా మా ఎన్నికలు తీవ్రరూపం దాల్చాలి.  ఇరు అభ్యర్థులు వ్యక్తిగత విమర్శలు చేసుకున్నారు . రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేదికగా.. పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన ఏకంగా మోహన్ బాబు పేరును ప్రస్తావిస్తూ కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ వ్యాఖ్యలకు ఎన్నికల అనంతరం సమాధానం చెబుతానని మోహన్ బాబు అన్నారు.

 
ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికలలో మంచు విష్ణు అధ్యక్షుడుగా గెలుపొందారు. విజయం ప్రకటించిన అనంతరం మోహన్ బాబు చాలా కూల్ గా మాట్లాడారు. ఓటు వేసి గెలిపించిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్ని మంచు మనోజ్ నెరవేరుస్తాడని మరో మారు గుర్తు చేశారు. దగ్గరుండి ఎన్నికలలో గెలిపించిన నరేష్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. 

click me!