నాగబాబు సంచలన నిర్ణయం.. `మా` సభ్యత్వానికి రాజీనామా..

Published : Oct 10, 2021, 11:13 PM ISTUpdated : Oct 10, 2021, 11:22 PM IST
నాగబాబు సంచలన నిర్ణయం.. `మా` సభ్యత్వానికి రాజీనామా..

సారాంశం

తాజాగా వెలువడిన ఫలితాల్లో ప్రకాష్‌ రాజ్‌ పరాజయం చెందారు. మెగా ఫ్యామిలీ సపోర్ట్ ప్రకాష్‌రాజ్‌ ప్యానెల్‌కి ఉందని ఆయన తెలిపిన నేపథ్యంలో ఇప్పుడు పరాజయం చెందడంతో మనస్థాపం చెంది రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. 

మెగా బ్రదర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన `మా` ప్రాథమిక రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా జరిగిన `మా` ఎన్నికల్లో ఆయన ప్రకాష్‌రాజ్‌ ప్యానెల్‌కి సపోర్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా వెలువడిన ఫలితాల్లో ప్రకాష్‌ రాజ్‌ పరాజయం చెందారు. మెగా ఫ్యామిలీ సపోర్ట్ ప్రకాష్‌రాజ్‌ ప్యానెల్‌కి ఉందని ఆయన తెలిపిన నేపథ్యంలో ఇప్పుడు పరాజయం చెందడంతో మనస్థాపం చెంది రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. 

నాగబాబు సోషల్‌ మీడియా ద్వారా రాజీనామాని ప్రకటించారు. `ప్రాంతీయ వాదం, సంకుచిత మనస్తత్వంతో కొట్టు, మిట్టులాడుతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేసన్‌లో కొనసాగడం నాకు ఇష్టం లేక, `మా` అసోసియేసన్‌ లో నా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా. సెలవు` అని పేర్కొన్నారు నాగబాబు. తన రాజీనామాని 48 గంటల్లో తన స్టాఫ్‌ మా అసోసియేషన్‌కి పంపిస్తారని వెల్లడించారు. 

also read: చిన్న పదవి కోసం లోకువ అవుతారా.. మీడియాకు మాత్రం ఆహారం కావొద్దు: ‘‘మా’’ పరిణామాలపై చిరు హాట్‌ కామెంట్స్

ఈ సందర్భంగా ఆయన ఇంకా చెబుతూ, ఇది నేను ఎంతోగానో ఆలోచించి, ప్రలోభాలకు అతీతంగా నా పూర్తి చిత్తశుద్దితో తీసుకున్నా నిర్ణయం` అని తెలిపారు నాగబాబు. ఈ సందర్భంగా ఫేస్‌ బుక్ లో ఆయన ఓ ఫోటోని పంచుకున్నారు. ఇందులో అందరు ఓ వైపు వెళ్తుంటే, ఒకరు మరో దారి వెళ్తున్నారు. `మా` సభ్యుల వెళ్తున్న దారిని, అదే సమయంలో `మా` రెండుగా చీలిన విధానాన్ని ఆవిష్కరించేలా ఆ ఫోటో ఉండటం విశేషం. 

ఇక ఆదివారం జరిగిన ఎన్నికల్లో మంచు విష్ణు 107 ఓట్ల మెజార్జీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రకాష్‌ రాజ్‌పై ఆయన గెలుపొందారు. అయితే ఇందులో ప్రకాష్‌ రాజ్‌ ప్యానెల్‌ తరఫున ఆయన అధ్యక్షుడిగా ఓడిపోయినా, ఆయన ప్యానెల్‌ నుంచి 11 మంది ఈసీ మెంబర్స్ గెలిచినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి ఫలితం రేపు ప్రకటించనున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే