హమీదని తలచుకుని శ్రీరామ్‌, అనీ మాస్టర్‌, స్వేత కన్నీళ్లు.. కాజల్‌ ఫేక్‌ పర్సన్‌ అంటూ కామెంట్‌

Published : Oct 10, 2021, 11:47 PM IST
హమీదని తలచుకుని శ్రీరామ్‌, అనీ మాస్టర్‌, స్వేత కన్నీళ్లు.. కాజల్‌ ఫేక్‌ పర్సన్‌ అంటూ కామెంట్‌

సారాంశం

శ్రీరామ్‌ కంటతడి పెట్టుకున్నాడు. హౌజ్‌లో వీరిద్దరు చిలుకా గొరెంకలుగా, లవర్స్ గా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తన ప్రియురాలు ఎలిమినేట్‌ కావడంతో శ్రీరామ్‌ ఎమోషనల్‌ అయ్యారు. ఆమెతో మాట్లాడే క్రమంలో కన్నీళ్లు పెట్టుకున్నాడు.

బిగ్‌బాస్‌ 5 ఐదో వారం పూర్తయ్యింది. ఐదో వారం ఎలిమినేషన్‌ పూర్తయ్యింది. ఈ వారం గ్లామర్‌ బ్యూటీ, బిగ్‌బాస్‌ హౌజ్‌లో హీరోయిన్‌గా చెప్పుకునే హమీద ఎలిమినేట్‌ అయ్యింది. దీంతో హౌజ్‌లో చాలా మంది భావోద్వేగానికి గురయ్యారు. శ్రీరామ్‌ కంటతడి పెట్టుకున్నాడు. హౌజ్‌లో వీరిద్దరు చిలుకా గొరెంకలుగా, లవర్స్ గా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తన ప్రియురాలు ఎలిమినేట్‌ కావడంతో శ్రీరామ్‌ ఎమోషనల్‌ అయ్యారు. ఆమెతో మాట్లాడే క్రమంలో కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనని అర్థం చేసుకున్న ఒకే ఒక్క అమ్మాయి హమీద అన్నారు శ్రీరామ్‌. 

ఇక ఎలిమినేట్‌ అయిన hamida ఇంటి సభ్యుల గురించి తన అభిప్రాయాలు పంచుకుంది. మానస్‌.. అగ్రెసివ్‌ అని తెలిపింది. కొన్నిసార్లు ఊరికే కోపానికి గురవుతాడని తెలిపింది. కాజల్‌ గురించి చెబుతూ, ఫేక్‌ పర్సన్‌ అని తెలిపింది. రిలేషన్స్ కి వ్యాల్యూ ఇస్తానని చెబుతుందని, కానీ అది పాటించదని, అది ఆమె గేమ్‌ అని తెలిపింది. జెస్సీ గురించి చెబుతూ, ఆయనతో కనెక్ట్ కాలేదని, ఫస్ట్ వీక్‌లో బాగానే ఉన్నారని, ఆ తర్వాత గ్యాప్‌ వచ్చిందని చెప్పింది హమీద.

సిరి గురించి చెబుతూ, ప్లిప్పర్‌ పర్సన్‌ అని తెలిపింది. షణ్ముఖ్‌ గురించి చెబుతూ, ఆయనో మాయా అని తెలిపింది. ప్రియాంక సింగ్ గురించి చెబుతూ, ఆమె ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కాదని చెప్పింది. ఆమెతో క్లోజ్‌కాలేదని తెలిపింది. ప్రియా గురించి చెబుతూ, హౌజ్‌లో తనకు విలన్ అని, ఆమెతో డిస్టర్బెన్స్ ఉందని, దాన్ని క్లీయర్ చేసుకున్నానని చెప్పింది. అనీ మాస్టర్ తనకు అమ్మలాంటిదని, బెడ్‌ మేట్‌ అని పేర్కొంది. తనకు హమీద చిన్న కూతురు లాంటిదని అనీ మాస్టర్ చెప్పారు. 

ఇక సన్నీ గురించి చెబుతూ డల్‌గా ఉన్నప్పుడు ఎనర్జీనిస్తాడని, నవ్విస్తాడని తెలిపింది. స్వేత గురించి చెబుతూ, గుడ్‌ పర్సన్‌ అని, చాలా బాగా చూసుకుంటుందని తెలిపింది. దీంతో స్వేత కన్నీళ్లు పెట్టుకుంది స్వేత. రవి గురించి చెబుతూ గుడ్‌ పర్సన్‌ అని, తనకు అన్నయ్య లేడని, రవిలాంటి అన్నయ్య కావాలని తెలిపింది. లోబో ఫన్నీ పర్సన్‌ అని, ఎక్కువ తింటాడని చెప్పింది. 

also read: నాగార్జున హౌజ్‌లో పూజా, అఖిల్‌ రొమాన్స్.. నాగ్‌ స్వీట్‌ వార్నింగ్‌.. పూజాని ఇంప్రెస్‌ చేయలేకపోయిన ఇంటి సభ్యులు

sreeram గురించి చెబుతూ, చాలా గుడ్‌ పర్సన్‌ అని, ఇంటి సభ్యులతో ఏదైనా క్లాష్‌ వస్తే దాన్ని క్లీయర్‌ చేసుకునేందుకు ప్రయత్నిస్తాడని, ఫెయిర్‌గా ఉండేందుకు ట్రై చేస్తాడని తెలిపింది. అయితే ఈ సందర్భంగా శ్రీరామ్‌ భావోద్వేగానికి గురయ్యాడు. ఈ సందర్భంగా హమీద కోసం ఓ పాట పాడమని నాగార్జున కోరగా, `నా హృదయంలో నిదురించే చెలి.. ` అనే పాటతో కదిలించాడు. హమీద ఎలిమినేషన్‌తో ప్రస్తుతం biggboss5 హౌజ్‌లో 14 మంది ఉన్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే