మా వెనుక పెద్దవాళ్ళు ఉన్నారు.. ప్రకాష్ రాజ్ కి మద్దతుగా బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

By team teluguFirst Published Jun 25, 2021, 11:51 AM IST
Highlights

మీడియా కాన్ఫరెన్స్ లో పాల్గొన్న నటుడు నిర్మాత బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నటుడు ప్రకాష్ రాజ్ సేవా గుణం, మంచితనాన్ని బండ్ల గణేష్ గుర్తు చేసుకున్నారు. 

మూవీ ఆర్టిస్ట్స్  అసోసియేషన్(MAA) అధ్యక్ష ఎన్నికలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఈసారి సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ నేరుగా పోటీకి దిగడం ఆసక్తికరంగా మారింది. మంచు విష్ణు, జీవితా రాజశేఖర్ ప్యానెల్స్ ఆయనకు పోటీగా ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. శ్రీకాంత్, సాయి కుమార్, జయసుధ వంటి సీనియర్ నటులతో కూడిన 27మంది సభ్యుల ప్యానెల్ ప్రకాష్ విడుదల చేశారు. నటుడు నాగబాబు సైతం మీడియా కాన్ఫరెన్స్ లో పాల్గొని ప్రకాష్ రాజ్ కి మద్దతు తెలిపారు. అలాగే పరోక్షంగా చిరంజీవి కూడా ప్రకాష్ రాజ్ ప్యానెల్ ని సపోర్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు.

 
ఈ మీడియా కాన్ఫరెన్స్ లో పాల్గొన్న నటుడు నిర్మాత బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నటుడు ప్రకాష్ రాజ్ సేవా గుణం, మంచితనాన్ని బండ్ల గణేష్ గుర్తు చేసుకున్నారు. ప్రకాష్ రాజ్ అన్నతో నాకు 23ఏళ్ల పరిచయం ఉంది, ఎప్పటి నుండో ఆయన నాకు ఆప్తుడు. హైదరాబాద్ పక్కన ల్యాండ్ కొని, ఫార్మ్ హౌస్ నిర్మించి వందల మందికి సహాయం చేస్తున్నారు.. అన్నారు. ముఖ్యంగా కోవిడ్ సమయంలో అనేక మంది రోజులకు సొంత ఖర్చులతో వైద్యం, భోజనం ఏర్పాటు చేశారని బండ్ల గణేష్ తెలిపారు. 


అనేక మంది పేద కళాకారుల పిల్లల చదువులకు, పెళ్లిళ్లకు లక్షల్లో దానాలు చేసిన విషయం గుర్తు చేసుకున్నారు బండ్ల గణేష్. మా సభ్యులందరూ ఒకటే, మా మధ్య కులమత వర్గ భేదాలు లేవు. నాన్ లోకల్ అనే ఫీలింగ్ అసలు లేదని బండ్ల గణేష్ అన్నారు. ఇక్కడ పుట్టిన ప్రభాస్ దేశాన్ని ఏలుతున్నాడు. రాజమౌళితో హాలీవుడ్ వాళ్ళు సినిమా చేయాలనుకుంటున్నారు. కాబట్టి ప్రతిభ, సమర్ధత ఉండాలి.. లోకల్ నాన్ లోకల్ అనే తారతమ్యాలు ఉండవని బండ్ల గణేష్ తెలిపారు. 


ప్రకాష్ రాజ్ రావడం వలన పేద కళాకారులకు ఉపాధి, వైద్యం, విద్య విషయంలో భరోసా కలుగుతుంది. గతంలో మా అధ్యక్షులుగా చేసినవారు కూడా బాగా చేశారు. వాళ్ళకంటే మెరుగ్గా ప్రకాష్ రాజ్ చేయగలరని భావించి సప్పోర్ట్ చేస్తున్నాను. మా వెనుక పెద్దపెద్ద వాళ్ళు ఉన్నారన్న బండ్ల గణేష్, విజయం ప్రకాష్ రాజ్ ప్యానెల్ దే అన్న విశ్వాసం వ్యక్తం చేశారు.

click me!